Showing posts with label Arpanaga hrudayamunu. Show all posts
Showing posts with label Arpanaga hrudayamunu. Show all posts

10 May 2022

Arpanaga hrudayamunu | అర్పణగా హృదయమును

అర్పణగా హృదయమును దేవునికి ఇమ్ము 
అర్పించే హృదయమే కానుకని ఎరుగుము (2)
కనికరమును కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి (2)

హృదయమును అర్పించి కానుకని ఇచెదను (2)
అర్పణగా హృదయమును దేవునికి ఇమ్ము 
ఆదిలోనే తెలిసింది తండ్రి నీయొక్క మనస్సు 
ఇచ్చే మనస్సునే కానీ కానుకను కోరవని (2) 
కయ్యేను అర్పించే అర్పణ కాదన్నావు నీకిచ్చిన
ధనమును కంటే గుణమును చూసే దేవుడవు
సాటిలేని దేవుడువు ...

అర్పణగా హృదయమును దేవునికి ఇమ్ము పేదవాడివా తండ్రి నీవు నా కానుకను కోరుటకు నాలాంటి బలహీనుడవ అక్కర కలిగి యుండుటకు (2)
ఇచ్చుట నేర్పించుటకే నన్ను ఇవ్వమన్నావు ఇచ్చినదాని కంటే బహుగా ఇచ్చావు 
నను పోషించే దేవుడవు ..... 

అర్పణగా హృదయమును దేవునికి ఇమ్ము 
సువార్త పనిలో సహకారునిగా ఉండెదను నేను 
పూర్ణ మనస్సుతో ఆరాధించి క్రీస్తు కృపను పొందెదను (2) 
నా ఆడుగులను తడబడక నడిపించూ నన్ను విడువక 
అన్నీ ఉంది నెమ్మదిలేని బ్రతుకునాకంటే ... 
నా కన్ని నీవై ఉన్న నా దేవుడవు అర్పణగా (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...