Showing posts with label సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. Show all posts
Showing posts with label సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. Show all posts

08 March 2021

Siyonulo nundi neevu | సీయోనులో నుండి నీవు

సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై - సదాకాలము 
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై -
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా 
నడిపించుచున్నావు నీ కీర్తికై -
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
 
1. నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి - ఉన్నత విజయము నిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు  ||సీయోనులో||
 
2. నాయందు దృష్టి నిలిపి - నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి - సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం - నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||
 
3. నీ దివ్యమైన మహిమను - పరలోకమందు నేచూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని - ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను 
నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...