Showing posts with label good Friday songs. Show all posts
Showing posts with label good Friday songs. Show all posts

23 March 2024

Kaluvari premanu kanugonavela కలువరి ప్రేమను కనుగొనవేల


కలువరి ప్రేమను కనుగొనవేల 
సిలువ విలువను ఎరుగవదేల

1. నీ నా పాపము మరణ శాపమై మ్రానుగ పడెను ఆయన వీపుపై 
కరమున శిరమున ముండ్లబాధలు దేహము నిండా రక్తపు ధారలు

2. నీతి సూర్యుని శ్రమగనలేక సూర్యుడే మరుగై వెలుగు దాచెనా 
సైనికుడొకడు గుండె కరుగగా నీతిమంతుడితడని మహిమపరచెనా

07 April 2023

Siluvalo vreladu prabhuve | సిలువలో వ్రేలాడు ప్రభువే

సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||

కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||

తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||

పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువ||

లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||

ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువ|| దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||

శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువ||

మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువ||

నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను

Siluvalo vreladuchunna yesuni | సిలువలో వ్రేలాడుచున్న యేసుని


సిలువలో వ్రేలాడుచున్న యేసుని చూడు
పాపులకై ప్రాణం విడచిన యేసుని చూడు (2)
నీకోసమే నాకోసమే /
మనలను రక్షించుట కోసమే (2)
॥సిలువలో॥

1.నా పాపములన్ని నా శాపములన్నీ
సిలువలో నీ రక్తముతో కడిగినావు (2)
ఏ పాపము లేని నీవు లోక పాపములను (2)
సిలువలో మాకై విడిపించావు (2)
॥సిలువలో॥

2.ద్రోహినైన నన్ను నా పాప దోషాలు
సిలువలో నీవే తొలగించావు (2)
ఏ దోషములేని నీవు లోక దోషములను (2)
సిలువలో మాకై భరియించావు (2) ||సిలువలో||

3.నా మరణ శిక్షకై నా పాప క్షమాపణకై
కలువరి సిలువలో ప్రాణం అర్పించావు (2)
ఏ శిక్షలేని నీకు లోక శిక్షలన్నిటికై (2)
సిలువలో ఘోరంగా మరణించావు (2) ||సిలువలో||
రచన: K.ప్రేమ్ కుమార్

Kanniti paryanthamu | కన్నీటి పర్యంతము ఆ నిమిషం

కన్నీటి పర్యంతము ఆ నిమిషం -
కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం (2)
చూడలేక కొందరు చూసి మరికొందరు
సత్యాన్ని తప్పించి స్వార్థానికి చోటిచ్చి

అవమానపరిచినారు నిన్ను -
అవహేళన చేసినారు నిన్ను (2) ||కన్నీటి ||

బంధాలే కనుమరుగు ఆ సమయాన
మనస్సాక్షి మరుగుపడిన ఆ స్థితిలోనా (2)
లెక్కింప లేని మేలులెన్నో చేసినా
లెక్క తప్పిపోకుండా కొరడాలతో కొట్టిరి (2)
శిరముపై ముళ్ళు గుచ్చి నిన్ను అపహసించిరి || కన్నీటి||

స్వస్థతలెన్నో చేసిన ఆ చేతులలో
వెలుగుకు నడిపిస్తున్న ఆ పాదాలలో (2)
పదునైన మేకులతో సిలువకు నిన్ను కొట్టి
కరుణ లేని ముష్కరులు సిలువ వేసినారు (2)
ప్రక్కలోన బళ్ళెమును గ్రక్కునదించారు ||కన్నీటి ||

వీరిని క్షమియించుమని తండ్రిని వేడితివి
బంధాలు బాధ్యతలు గుర్తు చేసితివి (2)
ప్రేమను మించినది లేదని నీవే తెలిపితివి
ఆ ప్రేమను సిలువలో నీవే చూపించితివి (2)
తండ్రి చిత్తమునకు నిన్ను అప్పగించుకొంటివి

Ningiloni chanduruda | నింగిలోని చందురుడా మంద కాచే

నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా (2)
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా (2)
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా (2)
 
ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన
 
తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? (2)
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా (2)
 
అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి
 
ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా (2)
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా (2)
 
లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి
 
నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా (2)
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా (2)

06 April 2023

Appagimpabadina rathri | అప్పగింపబడిన రాత్రి

అప్పగింపబడిన రాత్రి - చెప్ప సాగే శిష్యులతో (2)
చెప్పరాని దుఃఖముతో - తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప||

1.రొట్టె విరచి ప్రార్ధించి - నిట్టూర్పు విడచి దీన దేహం (2)
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు - ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప||

2.ద్రాక్షా రసగి నేను చాపి - వీక్షించుడిదియే నా రక్తం (2)
రక్షణార్థం దీని త్రాగి - మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప||

3.రాతివేత దూరాన - చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమైతే - ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప||

4.ఇదిగో వచ్ఛే తుది ఘడియలు - హృదయ బాధ హెచ్చెను (2)
పదిలపరచు నట్లు తండ్రి - మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||

22 March 2023

Endukayya ee vedhana | ఎందుకయ్యా ఈ వేదనా ఎవరి కొరకు


ఎందుకయ్యా ఈ వేదనా - ఎవరి కొరకు ఈ శోధనా (2)
ఎందుకొరకు ఈ త్యాగము -ఎవరి కొరకు ఈ బలిదానం (2) ||ఎందుకయ్యా||

1.రెల్లుగడ్డినే రాజదండముగా చేసి.. 
ముళ్ళ కిరీటము శిరమున మోపి.. (2)
మోము పైన ఉమ్మి వేసి ..వలువలులాగి విలువలు మరచి..
యూదుల రాజు నీవేనంటూ అపహసించిరి ... అవమానించిరి ||ఎందుకయ్యా||

2.పాప భారము భుజముపై మోస్తూ... కలువరికే పయనమవ్వగా.. (2)
సిలువ మ్రానును మోయలేక ..
తడబడు అడుగులతో సొమ్మసిల్లగా..(2)
ప్రేమ మనసులు తల్లడిల్లెను ...
కఠిన శిలలు కన్నీరు కార్చేను ||ఎందుకయ్యా||

17 April 2022

Yesuni prema varnimpa sadhyama | యేసుని ప్రేమ వర్ణింప సాధ్యమా


యేసుని ప్రేమ - వర్ణింపసాధ్యమా
యేసుని ప్రేమ - వివరింప సాధ్యమా (2)
అద్భుతమైనది - ఆర్పజాలనిది
అంతమువరకు - నను విడువనిది
ఆశ్చర్యమైనది - అమరమైనది
ఉహకుమించిన - మేలులు చేయునది
||యేసుని||

1.నా పాపముకై - సిలువను మోసిన ప్రేమ
నా రక్షణకై - రక్తము కార్చిన ప్రేమ (2)
కొరడాల దెబ్బలను - భరియించిన ప్రేమ
రాళ్ళు విసిరిన - మాట పలకని ప్రేమ
లోకులు ఎవ్వరు నాపై చూపని - అద్వితీయ ప్రేమ
లోకపాపములు పరిహరించుటకు - (తన) ప్రాణమిచ్చిన ప్రేమ ||యేసుని||

2.నా శాపముకై ముళ్లను - ధరించిన ప్రేమ
నా స్వస్థతకై గాయాలు - పొందిన ప్రేమ (2)
వెలను చెల్లించి నన్ను - కొన్న ప్రేమ
పరిశుద్దినిగా నన్ను - మార్చిన ప్రేమ
పంచగాయలు నాకైపొంది - మరణించిన ప్రేమ
ముడవదినమున తిరిగిలేచిన - పునరుత్థానుని ప్రేమ ||యేసుని||
Lyrics & Vocals: Joseph Konda

Siramuvanchi mana andari | శిరమువంచి మన అందరి


శిరమువంచి మన అందరి శాపాన్ని మోసెను
కరములు చాపి మన అందరికి మోక్షాన్ని పంచెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

1.శాపపు సిలువ ఓడిపోయెను - ఓడిపోయెను ఓడిపోయెను
నరకపు బలము కూలిపోయెను - కూలిపోయెను కూలిపోయెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

2.మరణపు ముల్లును విరచి వేసెను - విరచి వేసెను - విరచి వేసెను
మహిమగ మనలను మార్చి వేసెను - మార్చి వేసెను - మార్చి వేసెను (2)
యేసుని నామములో… ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

3.నరకపు ద్వారము మూసివేసెను - మూసివేసెను - మూసివేసెను
జీవపు మార్గపు బాట వేసెను - బాట వేసెను - బాట వేసెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

15 April 2022

Kanalenu prabhukela shrama | కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై… ||కనలేను||

పాపులనేలేటి ప్రభునేలనో - 
బల్లెంపు పోటుల బంధించిరి (2)
కనుపించు పాపాలు రక్తాలలో - 
ప్రభు బాధలో ||కనలేను||

ముండ్ల కిరీటము ప్రభుకేలనో - 
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2)
ప్రభు రక్త గాయాలు నా పాపమా -
ప్రభు శాపమా ||కనలేను||

తన జంపు శత్రువుల క్షమియించెను -
క్షమియింపుమని తండ్రిని వేడెను (2)
క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను -
భరియించెను ||కనలేను||

మోయజాలని సిలువ మోయించిరి - 
దివినేలు బాహువులు బంధించిరి (2)
నా పాపమంతయు ప్రభు మోసెను - 
భరియించెను ||కనలేను||

జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో - 
చేదు చిరక త్రాగను అందించిరి (2)
ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను - 
సిలువొందెను ||కనలేను||

తన ఆత్మ తండ్రికి సమర్పించెను -
తనదంతా తండ్రితో చాచుంచెను (2)
తలవంచి తండ్రిలో తుది చేరెను -
కను మూసెను ||కనలేను||

లోకాలనేలేటి ప్రభువేలనో -
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2)
నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో -
సిలువేసెనో ||కనలేను||

14 April 2022

Siluvalo na koraku vreladina | సిలువలో నా కొరకు వ్రేలాడిన

సిలువలో నా కొరకు - వ్రేలాడిన యేసయ్యా 
పరిశుద్ధ రక్తమును - చిందించినావయ్యా (2)
ఏల ఈ ఘోర శ్రమ - ఘనదైవమా నీకు 
పాపిని రక్షించుటకు బలియైతివా (నీవు) (2)

1.నా పాపయోచనలు - ముండ్ల మకుటమాయెను 
నే చేసిన దోషములు - చేతులలో సీలలాయె (2)
నా చెడు నడతలు - ప్రక్కలో బల్లెమాయె (2)
నేనే ప్రభు నిన్ను - సిలువకప్పగించినది (2) ||సిలువలో||

2.నా పాపభారమంత - సిలువలో మోసితివి 
వ్యాధి బాధలన్నియు - నీవే భరియించితివి (2) 
సురూపివి నీవయ్యా - కురూపిగా మారితివి (2)
ఏమని (నేనేమని) వర్ణింతును - నీ త్యాగ నిరతిని (2) ||సిలువలో||

3.నీ సిలువను చూడగనే - మనసు నీరై కరిగెను 
నా హృదయం ఎంతో - వేదనతో నిండెను (2)
ఈ లోకమును వీడి - నిను వెంబడింతునయ్య (2)
క్షమియించి నీ సాక్షిగ - స్థిరపరచుము యేసయ్యా (2) ||సిలువలో||

Moyaleni bharamantha siluvalo | మోయలేని భారమంత సిలువలో

మోయలేని భారమంత సిలువలో మోసావు 
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు (2)

కడలి పై నడిచిన పాదాలు ! సిలువ బరువుకు తడబడి పోయే 
స్వస్థతలు చూపిన హస్తములు ! సిలువలో సీలలతో వ్రేలాడే (2)
ఇంత ఘోరము , మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) ||మోయలేని||

జయము నీకని పలికిన జనము మహిమ ఏదని ? నిను నిలదీసిరి 
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము (2) ||మోయలేని|| 

దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి 
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ (2) ||మోయలేని||

12 April 2022

Nenante Entha Premo| నేనంటె ఎంత ప్రేమో

నేనంటె ఎంత ప్రేమో - ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువ నెక్కె - నా కల్వరి నాధునికి (2)
యేసు రక్తమే జయం - సిలువ రక్తమే జయం
యేసు రక్తమే జయం - సిలువ రక్తమే జయం ||నేనంటె||

1.కలువరి రుధిరములో - కడుగబడిన శిలను
నీ రక్త ప్రవాహములో సిలువ చెంత చేరాను (2)
నీ ప్రేమే మార్చిందయా నన్నిలా
ఆ ప్రేమకు బానిసగా మారానయ్యా (2) ||నేనంటె||

2.నను రక్షించుటకు - నీ ప్రాణమర్పింప
వెనుకాడ లేదుగా నా యేసయ్య…
నా శిక్ష భరియించి - శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా…
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును
నా ఆత్మ విలువ నీవు యోచించితివా (2)||నేనంటె||
Lyrics: Nissy Paul
Vocals: Nissy Paul
https://youtu.be/Exo9lMTmuTI

10 April 2022

Siluvalo vreladuchunna yesunu | సిలువలో వ్రేలాచున్న యేసును

సిలువలో వ్రేలాచున్న యేసును చూడు 
పాపులకై ప్రాణం విడచిన యేసును చూడు (2)
నీ కోసమే నా కొసమే మనలను రక్షించుట కోసమే (2)

1.నా పాపములన్ని నాశాపాములన్ని - సిలువలో నీ రక్తంతో కడిగినావు (2)
ఏ పాపము లేని నీవు లోకపాపములను (2)
సిలువలో మాకై విడిపించావు (2) ||సిలువలో||

2.ద్రోహినైన నన్ను నాపాప దోషాలు - ఎన్నో సిలువలో నీవే తొలగించావు (2)
ఏ దోషము లేని లోక దోషములను (2)
సిలువలో మాకై భరియించావు (2) ||సిలువలో||

 3.నా మరణ శిక్షకై పాప క్షమాపణకై కలువరి సిలువలో ప్రాణము అర్పించావు (2)
ఏ శిక్ష లేని నీకు లోక శిక్షలన్నీటికై (2)
సిలువలో ఘోరంగా మరణించావు (2) ||సిలువలో|| 

Gunde ninda kanneere | గుండె నిండాకన్నీరే దేహమంత

గుండె నిండాకన్నీరే - దేహమంత గాయాలే 
పాపినైన నాకోసం - ప్రాణత్యాగమా 
దోషినైన నాకోసం -సిలువ త్యాగమా 
ఓ .... నా ప్రాణమా .... 
నీ కొరకే యేసయ్య ప్రాణ త్యాగము 
నీ కొరకే యేసయ్య సిలువ త్యాగము 

1.దొంగ ముద్దుపెట్టుకుని - ధన మోహముతో 
నిన్ను అప్పగించింది నేనే కదా 
ఇంత చేసిన నాకై కన్నీరా (2)
ఓ ..... నా ప్రాణమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా || గుండె ||

2.పిడుగుద్దులు గుద్ది - గుండెల్లో తన్ని 
దేహమంత చీల్చింది నేనే కదా 
ఇంత చేసిన నాకైవేదనా (2)
ఓ ..... నా ప్రాణమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా || గుండె ||

3.ముళ్ళ కిరీటము పెట్టి - మ్రేకులే కొట్టి 
ప్రక్కలో పొడిచింది నేనే కదా 
ఇంత ఘోరము చేసిన నాకై కన్నీరా 
ఓ ..... నా ప్రాణమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా || గుండె ||

4.తల్లడిల్లిపోతుంది సిలువలో నీ ప్రాణం 
పాపినైన నాకోసం దోషినైన నన్ను చూసి 
ఇంత ఘోరము చేసిన నాకై కన్నీరా 
ఓ .... మానవా .... ఓ ... నేస్తమా .... 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా 
నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా || గుండె ||
Listen this @
https://youtu.be/l-AKoaN6n9o

06 April 2022

Mosithivaa na korakai siluva|మోసితివా నా కొరకై సిలువ వేదనను

మోసితివా నా కొరకై సిలువ వేదనను
గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో
సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును
పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా||

అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్
ఏలి ఏలి లామా సబక్తానీ చే విడిచి
దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా
ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి 
యూదుల రాజని హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో
దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా||

తర తరాల ఈ లోకం - యుగయుగాల నీ నామం
తరగని వేదన నీకు సిలువ విజయమునకే
కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత
విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా
చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే
అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా ||మోసితివా||

05 April 2022

Siluvapai o Snehithuda | సిలువాపై ఓ స్నేహితుడా

సిలువాపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా (2)
నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య (2)

1.నా కొరకు త్యాగమూర్తివై - బహు విలువైన నీ రక్తము (2)
ధారలుగా నా భారముగా చిందించావులే - నా యెదుట (2)
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము (2) ||సిలువాపై||

2.కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా (2)
మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట (2)
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము (2) ||సిలువాపై||

Varninchalenu vivarinchalenu | వర్ణించలేను వివరించలేను

వర్ణించలేను వివరించలేను 
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) 
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) 

1.పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు - పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను || యేసయ్యా || 

2.అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు - ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) 
ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను || యేసయ్యా ||

3.తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను - ఆదరించినావు ఓదార్చినావు (2) 
ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను || యేసయ్యా ||

04 April 2022

Balipashuvuga naa korakai | బలిపశువుగా నా కొరకై ఏతెంచావు

బలిపశువుగా నా కొరకై ఏతెంచావు
క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు
చేతకాని మరణం కాదది చేయబూనినా ప్రేమైక త్యాగమది విమోచనకార్యం జరిగినది క్షమాపణ ద్వారం తీయబడినది

1.శ్రమపొందుచున్నను బెదిరించకుంటివి వధకు తేబడు గొర్రెలా మౌనివైతివి 
హేళన చేయువారిపై కోపించక ప్రార్ధన చేసియుంటివి
కారణమేమి లేకనే దూషించినా బాధను ఓర్చుకుంటివి భారము దించియుంటివి 

2.అధికారమున్నను తలదించుకుంటివి - అవమానములో సహనము వీడవైతివి 
నేరము మోపుచున్నను చలించక ఉత్తరమియ్యకుంటివి
వ్యాధిని అనుభవించుచు ఏమాత్రము రూపము లేకయుంటివి 
స్వస్థత నిచ్చియుంటివి 

3.కొట్టుచుండ వీపును అప్పగించుకుంటివి ఉమ్మువారికి నీ ముఖమును దాచవైతివి 
ఎన్నిక చేయకున్నను గణించక దోషిగ నిలిచియుంటివి
రక్షణ అనుగ్రహించను నీమీదను శిక్షను వేసుకుంటివి
మార్గము చూపియుంటివి

03 April 2022

Naa koraku chanipoyi nada | నా కొఱకుఁ చనిపోయి నాఁడ

209 
యేసు క్రీస్తు మరణావస్థ ధ్యానము
(ఛాయ: ఈయన యేసు రక్షకుండు)
రా - ముఖారి,   తా - అట

నా కొఱకుఁ చనిపోయి నాఁడ - ఆద - యాకరుండిరు ¹వంక దొంగలతోడ ||నా కొఱకు||

1.ఆలకింపగను మనసార - నాకు - ²నానదే యా దయామృత సారధార - భూలోకమునఁదనివిఁ దీర - నిట్టి - పుణ్యాత్ము నేమఱక - పూజింతు ³మీర ||నా కొఱకు||

2.కన్న తలిదండ్రులకు నైన - యింత ఘన ⁴వత్సలత నేఁ - గల్గుటంగాన - విన్నదియులేదు చెవులూన - స్వామి - విక్రయంబై కొర్త - వేదనలతోను ||నా కొఱకు||

3.కీటకమువంటి ననుఁ బ్రోవ - సొంత - ⁵కీలాలమర్పించి - ⁶ఖేదపడిచావ - ⁷వాటమా తన కిటులఁ గావ - నేను - వర్ణింపఁ గన్నీరు - వరదలైపోవ ||నా కొఱకు||

4.ఘోరముగ నినుపమేకులను - గ్రుచ్చి - ⁸కొంకకానిర్దయుల్ - గొల్గొతా ⁹మనలను - మారణంబగు నవస్థలను - బెట్ట - మాదృశాత్మన్గావ - మౌనమైయిలను ||నా కొఱకు||

5.ఏమి బహుమతుల నర్పింతు - నట్టి - స్వామిమేళ్లల్ల నా - స్వాంతమున నుంతున్ - ప్రేమ భావమున వర్తింతున్ - నిత్య - ¹⁰కామితార్థం బిడు - కర్తను భజింతున్ ||నా కొఱకు||

6.చేయనిఁక పాప ¹¹సంగతము - నాఁడు - సిలువపైఁ జచ్చిన శ్రీకరుని ¹²కతము - పాయ కాబ్రభుసత్యవ్రతము - నాధు - ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు సతము ||నా కొఱకు||
                          – మిక్కిలి సమూయేలు
__________________________________

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...