Showing posts with label 322 శరణు నా యేసు ప్రభువా. Show all posts
Showing posts with label 322 శరణు నా యేసు ప్రభువా. Show all posts

27 August 2021

Sharanu Naa Yesu Prabhuva | శరణు నా యేసు ప్రభువా

322                     క్రీస్తు మోక్ష మార్గము 
రా – అనంద భైరవి (చాయ: దేవుని ప్రేమ ఇదిగో )తా - కురుజంపై 

శరణు నా యేసు ప్రభువా - నీవెగా - పరలోకమునకుఁ ద్రోవ = కరుణతో నన్నుఁ గావ - నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా || శరణు ||

1. పర సుఖము విడిచినావు - కన్యక - మరియ గర్భమున నీవు = ధరణి నుదయించినావు - నీ కన్న - దాత యెవ్వఁడు యేసువా || శరణు ||

2. పాపభారము క్రిందను - బడి యున్న - పాపాత్ములను నెల్లను = జేఁపట్టి రక్షింపఁగా - నీ కన్న - శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా || శరణు || 

3. మరణమై లేచినావు - జీవింప - మార్గంబుఁ జూపినావు = పరమహిమ జూపినావు - నీ కన్నఁ - ప్రభుఁ డెవ్వడు యేసువా || శరణు || 
                                         – మిక్కిలి సమూయేలు

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...