Showing posts with label 332 అపరాధిని యేసయ్య. Show all posts
Showing posts with label 332 అపరాధిని యేసయ్య. Show all posts

26 May 2020

Aparadhini Yesayya lyrics అపరాధిని యేసయ్య

332
పాపి పశ్చాత్తాపము

అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు ||అపరాధిని||

1.సిలువకు నిను నేగొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ||అపరాధిని||

2.ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కునపొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో ||అపరాధిని||

3.ముళ్లతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రి ||అపరాధిని||

4.దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ||అపరాధిని||

5.ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా  ||అపరాధిని||

6.చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో - సందేహ మేలనయ్యా ||అపరాధిని||

7.శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యమునియ్య - మోక్షంబు జూపితివయ్యా ||అపరాధిని||
         - సిరిపురపు కృపానందము
-----------------------------
Aparadhini yessayya - krupajupi bhrovumayya -
nepamenchakaye nee krupalo -  naparadhamulanu kshaminchu  ||aparadhini||

1. Siluvaku ninu negottitini - tuluvalalo - jerithini- 
kalushambulanu mopitini - doshunda nenu prabhuva ||aparadhini||

2. Prakkalo ballepu potu - grakkuna podichithi nene - 
mikkili bhadinchithini - makkuvu jupithivayyo ||aparadhini||

3. Mullatho kireetambu - nalli nee siramuna nidithi - 
navalla neramaye - challani dayagala thandri ||aparadhini||

4. Daahambu gonaga chedu - chirakanu dravanidithi - 
dhrohundanai jesithinee - dhehambu gaayambulanu ||aparadhini||

5. Ghorambuga dhurithini - nerambulanu jesithini - 
khrurundanai - gottithini ghorampu paapini devaa ||aparadhini||

6. Chindhithi rakthamu naakai - pondina debbalachetha - 
apa nindalu pettithinayyo - sandehamelanayya ||aparadhini||

7. Shikshaku paathrudanayya - rakshana dechitivayya -
akshaya bhagyamu niyya - mokshambu jupitivayya ||aparadhini||
        - Siripurapu Krupanandam
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...