Showing posts with label Sp balu songs. Show all posts
Showing posts with label Sp balu songs. Show all posts

09 December 2024

Bangaru bommavu neevamma బంగారు బొమ్మవు నీవమ్మా

బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా
శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ

1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా– పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా
విరిగిన మనసే వరుని కట్నమమ్మా– నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములొ తడిచిన – పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||

2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా– అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా – ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా ||బంగారు||

3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా – దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా
సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా – దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా ||బంగారు||

31 May 2023

Inti meedanunna ontari ఇంటి మీదనున్న ఒంటరి

నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా

ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥

1.వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥

2.తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటిII
DOWNLOAD MP3 SONG HERE 👇

23 February 2021

Swagathamo Deva Suma Swagathamo | స్వాగతమూ దేవా సుమ స్వాగతమో

స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా
నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా 
వేంచేసిన ఈ శుభవేళ
                                     ||స్వాగత||
ఇద్దరు ముగ్గురు కూడిన చోట - 
నేనుంటానని పలికిన దేవా (2)
మా దోషములను క్షమియించు స్వామి (2)
నీ కృపలో మమ్ము నడిపించు దేవా (2)
                                     ||స్వాగత||
గురువుతో చేసెడి ఈ బలియాగం - 
మాకెల్లరకు ఆశీర్వాదం (2)
ఆత్మను మాపై కురిపించు స్వామి (2)
మా జీవితములు పండించు దేవా (2)
                                     ||స్వాగత||

27 January 2021

Kaaru Moyilu Daarilo | కారు మొయిలు దారిలో

 
కారు మొయిలు దారిలో - కఠిన శిలల నేలలో
వెలుగు విరులు వెలసి - కనుల విందు సేయ జాలునా ||కారు||  

ఇరుకు లోయ నడుమలో - కరకు రాతి అడుగులో
మరణ భయము నార్పివేయు - కరుణ జలము లూరునా ||కారు||  

ఎండిన ఎడారిలో - మండుటెండ మేరలో
మధుర వాయు తటులు వీచి - మనసు సేద దీరునా ||కారు||   

రుధిర సిక్త నగములో - హృదయ భగ్న పదములో
మధుర మృదుల కధములైన - మాటలెన్న వచ్చునా 
||కారు||  

స్వామి యేసు సిలువలో - జీవ జలపు నదులలో
హృదయ క్షుదను దీర్చు క్రీస్తు - విమల సుధలు నిండగా ||కారు||
 DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...