Showing posts with label Naa Jeevitha Bhagaswamivi. Show all posts
Showing posts with label Naa Jeevitha Bhagaswamivi. Show all posts

15 October 2021

Naa Jeevitha Bhagaswamivi | నా జీవిత భాగస్వామివి

నా జీవిత భాగస్వామివి నీవు - నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు - నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి - నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి - నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల మాటలే చేరదీసినవి - నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి - నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి - నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు - నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...