Showing posts with label Hosanna songs. Show all posts
Showing posts with label Hosanna songs. Show all posts

24 September 2022

Niluvaramaina pattanamu|నిలువరమైన పట్టణము మనకిలలో


నిలువరమైన పట్టణము మనకిలలో లేదురా మానవా యాత్రీకులము .. ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన || నిలువరమైన || 
 

1.శాశ్వతమైన సహవాసమును కోరి జీవించెను హేబేలు కయ్యిను కంటే శ్రేష్ఠమైన బలి అర్పించెను దేవునికి || నిలువరమైన || 

2. భయము భక్తి గల సహవాసము చేసెను నోవాహు దేవునితో ఇంటి వారి రక్షణ కొరకై సిద్ధము చేసెను ఓడను || నిలువరమైన || 

3.కోరుకొనిన సహవాసముతో నడచెను యాకోబు దేవునితో నీవు నను దీవించు వరకు విడచి వెళ్ళని దీనుడను  

4.త్యాగము చేసిన అబ్రహాము స్నేహము చేసెను దేవునితో || నిలువరమైన || ఇస్సాకును బలి అర్పించి అయ్యెను తండ్రి విశ్వాసులకు  

5.శోధనలో సహవాసము చేసెను యవ్వనుడైన యోసేపు పాపమును జయించిన వాడై వెళ్ళెను ఐగుప్తు ప్రభువుగా || నిలువరమైన ||

Naa pranama naa samasthama|నా ప్రాణమా నా సమస్తమా

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2)
నా ప్రాణమా నా సమస్తమా   

1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||  

2.అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటి పాపగ నీవు నన్ను కాచితివి (2)
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను ||నా ప్రాణమా||
 
3.నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు (2)
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా|| 
DOWNLOAD MP3 SONG HERE 👇 

17 April 2022

Yesayya nee krupa nanu | యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి

యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా ||యేసయ్యా|
|

1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు ||యేసయ్యా||

2.నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును ||యేసయ్యా||

3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
ఈ కోరిక నాలో తీరునా? - రాకడలోనే తీరును ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

08 April 2022

Sthuthi pathruda sthothrarhuda | స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా - స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి||

1.నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు (2) ||స్తుతి||

2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నిధిలో - నీ సంఘములో (2) ||స్తుతి||
                         – పాస్టర్ యేసుదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

Sthuthi simhasanaseenuda na aardhanaku | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - నాఆరాధనకు యోగ్యుడా (2)
నాలో నీవుండగ నీలో నేనుండగ - ఇక నేనేల భయపడుదును (2)
 
1.ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాదపీఠం (2)
ఆ సింహాసనం విడిచి సిలువకు దిగివచ్చి ప్రాణ త్యాగము చేసి (2)
నీ ప్రేమామృతం త్రాగించితివి - నిను స్తుతించుటకు బ్రతికించితివి (2) ||స్తుతి||
  
2.రాజాధిరాజా ప్రభువులకు ప్రభువా - ఎవరు నీకిలలో సాటి (2)
సదాకాలం నిలిచే నీ సింహాసనం - జయించిన వారికే సొంతం (2)
ఈ జీవన పోరాటములో - నాకు జయమిచ్చుట నీకే సాధ్యం (2) ||స్తుతి||
 
3.నా రాజ్యము లోకసంబంధమైనది - కానే కాదంటివే (2)
నా షాలేము రారాజ స్థాపించితివి - నీ బలముతొ ప్రేమరాజ్యం (2)
మార్పు లేని నీ కృపకు నా ప్రభువా - మార్చితివే నీ రాజ్య పౌరుని (2) ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

13 March 2022

Athi sundarudavu yesayya | అతి సుందరుడవు యేసయ్య

Hosanna Ministries 32nd Album [ Srikaruda Naa Yesayya ] Song - 6 - " అతిసుందరుడవు " Athisundarudavu

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
హల్లెలూయ.. హల్లెలూయ.. హోసన్నా. ఆరాధన (2)

1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు - కృపాక్షేమములు నీ మందిరములో - సమృద్ధిగా కలవు (2)
నే దీనుడనై నీసన్నిధిని అనుభవించెను (2)
పరవశించి..పరవళ్లు తొక్కి.. ఆరాధించెదను (2) ||అతి||

2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించి యున్నావు (2)
విశ్వాసముతో ఓర్పు కలిగి - వాగ్దానము నే పొందెదను (2)
సంపూర్ణతకై.. పరిశుద్ధుడనై.. ఆరాధించెదను (2) ||అతి||

3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు - పునాదులుగల పట్టణములు కట్టుచున్నావు (2)
సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు (2)
నీ మహిమనుపొంది.. నీ దరిచేరి.. ఆరాధించెదను (2) 

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
ఆరాధనకు నీవు యోగ్యుడవు స్తుతులకు నీవె పాత్రుడవు

26 January 2022

Krupa sathya sampurnuda | కృపా సత్యా సంపూర్ణుడా

కృపా సత్యా సంపూర్ణుడా - 
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా
మహనీయుడవు నీవేనయా ...

1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా (2)
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2) ||కృపా||

2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా (2)
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే (2)|| కృపా||

3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా (2)
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే (2) ||కృపా||

DOWNLOAD MP3 SONG HERE 👇

19 January 2022

Neetho na Jeevitham santhoshame | నీతో నా జీవితం సంతోషమే

నీతో నా జీవితం సంతోషమే - నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే

భీకర ధ్వనిగలా మార్గమునందు - నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం - క్షణమైన విడువను నీతో సహవాసం (2)||ఆరాధ్యుడా||

సంతోషమందైనా శ్రమలయందైనను - నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు - శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||

ఆకాశమందుండి ఆశీర్వదించితివి - అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు - నూతన కృపలతో నను నింపుచున్నావు (2)||నీతో నా||

DOWNLOAD MP3 SONG HERE 👇

02 January 2022

Viluvainadhi samayamu o nesthama | విలువైనది సమయము ఓ నేస్తమా

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||

శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||

15 October 2021

Neeti Vaagula Koraku | నీటి వాగుల కొరకు


నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా(2)

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి - 
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2)
నా అడుగులు స్థిరపరచి - బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
ఇలలో వెంబడింతు ప్రభూ  ||నా ప్రాణమ||

2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను -
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2)
కంటిపాపగ నీవు - నన్ను కాచితివి (2)
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Manaserigina Yesayya | మనసెరిగిన యేసయ్యా మదిలోన


మనసెరిగిన యేసయ్యా - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు

నిర్జీవ క్రియలను విడిచి - పరిపూర్ణ పరిశుద్ధతకై 
సాగిపోదును నేను - ఆగిపోలేనుగా 
సాహసక్రియలు చేయు - నీ హస్తముతో 
నన్ను పట్టుకొంటివే - విడువలేవు ఎన్నడు || మన || 

వెనుకున్న వాటిని మరిచి - నీ తోడు నేను కోరి 
ఆత్మీయ యాత్రలో నేను - సొమ్మసిల్లి పోనుగా 
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో 
నన్ను ఆదుకొంటివే - ఎదబాయవు ఎన్నడు || మన || 

మర్త్యమైన దేహము వదిలి - అమర్త్యతను పొందుటకై 
ప్రభుబల్లారాధనకు - దూరము కాలేనుగా 
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే 
నన్ను కౌగిలించెనే - వదలేవు ఎన్నడు || మన ||

DOWNLOAD MP3 SONG HERE 👇

Naa Jeevitha Bhagaswamivi | నా జీవిత భాగస్వామివి

నా జీవిత భాగస్వామివి నీవు - నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు - నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి - నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి - నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల మాటలే చేరదీసినవి - నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి - నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి - నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు - నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||

DOWNLOAD MP3 SONG HERE 👇

18 August 2021

Alpha Omega Ayina Mahimanwithuda | అల్ఫా ఒమేగ అయిన మహిమాన్వితుడా

అల్ఫా ఒమేగ అయిన - మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా - పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా 
నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 

తేజోమయుడా నీ దివ్య సంకల్పమే - ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుచుటకు 
ఆశ నిరాశల వలయాలు తప్పించి - అగ్ని జ్వాలగ నను చేసెను 
నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే ||అల్ఫా ఒమేగ||

నిజస్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా - 
నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను 
నా చెలిమి నీతోనేె - నా కలమి నీలోనేె ||అల్ఫా ఒమేగ||
DOWNLOAD MP3 SONG 👇

05 August 2021

Naakentho Aanandam Nee Sannidhi | నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా


నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా -
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)

 
1.ఏ అపాయము నను సమీపించక - ఏ రోగమైనను నా దరికి చేరక (2)
నీవు నడువు మార్గములో నా పాదము జారక - నీ దూతలే నన్ను కాపాడితిరా ||నా కెంతో|| 
 

2.నా వేదనలో నిన్ను వేడుకొంటిని - నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2)
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా - నా కన్న తండ్రివై కాపాడుచుంటివా ||నా కెంతో|| 
 

3.నూతన యెరూషలేం నా గమ్యమేనని - నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2)
నీ వుండు స్థలములో నేనుండ గోరెదను - నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా ||నా కెంతో||
DOWNLOAD MP3 SONG HERE 👇

24 April 2021

Nee Mukhamu Manoharamu | నీ ముఖము మనోహరము


నీ ముఖము మనోహరము 
నీ స్వరము మాధుర్యము 
నీ పాదాలు అపరంజిమయము 

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా 
మనగలనా నిను వీడి క్షణమైనా 

నీవే నా తోడువై.. నీవే నా జీవమై -
నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై (2)
అణువణువున నీ కృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై (2)
                                   ||యేసయ్యా||
నీవే నా శైలమై.. నీవే నా శృంగమై -
నా విజయానికే నీవు భుజబలమై (2)
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు(2)
                                   ||యేసయ్యా||
నీవే వెలుగువై... నీవే ఆలయమై -
నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసెదను (2)
                                   ||యేసయ్యా||

04 April 2021

Yeguruchunnadhi Vijaya Pathakam | ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును (2)
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం

1.యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది (2)
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే (2)

2.దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం (2)
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం (2)

3.మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా (2)
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

31 March 2021

Sarirarevvaru Na Priyudaina Yesayyaku | సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2)
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు (2)
 
1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)  ||సరిరారెవ్వరూ || 
 
2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే(2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరిరారెవ్వరూ||  

3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే (2)
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే (2) ||సరిరారెవ్వరూ||  
 DOWNLOAD MP3 SONG HERE 

Abrahamu Devudavu Essaku Devudavu | అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

1.అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను  
   పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను   
   అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

2.ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను   
   వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను   
   ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య

3.యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను   
   యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను   
   యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
   యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇

30 March 2021

Nenu Velle Maargamu Naa Yesuke | నేను వెళ్ళే మార్గము నా యేసుకే

నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను(2) 
                                              ||నేను||
1.కడలేని కడలి తీరము -
   ఎడమాయె కడకు నా బ్రతుకున(2)
   గురిలేని తరుణాన వెరువగ - 
   నాదరినే నిలిచేవ నాప్రభు
   హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

2. జలములలోబడి నే వెళ్లినా- 
    అవి నా మీద పారవు(2)
    అగ్నిలో నేను నడచినా - 
    జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

3. విశ్వాస నావ సాగుచు- 
    పయనించు సమయాన నా ప్రభు(2)
    సాతాను సుడిగాలి రేపగా -
    నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

28 March 2021

Naa Arpanalu Neevu Parishudha | నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద (2)
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని (2)

1. ఆధారణలేని ఈ లోకములో -
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే (2)
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో -
అరణ్యవాసమే నాకు మేలాయెనే  (2)  ||నా అర్పణలు||

2. గమ్యమెరుగని వ్యామోహాలలో-
గురి నిలిపితినే - మార్గము చూపిన నీపైనే (2)
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో-
షాలేము నీడయే నాకు మేలాయెనే (2) ||నా అర్పణలు||

3. మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే (2)
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో -
సీయోను ధ్యానమే నాకు మేలాయెను (2) ||నా అర్పణలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...