Showing posts with label మార్టిన్ లూథర్. Show all posts
Showing posts with label మార్టిన్ లూథర్. Show all posts

16 August 2021

Maakartha Gatti Durgamu | మాకర్త గట్టి దుర్గము నే నమ్ము

37
A mighty fortress is our God

1.మాకర్త గట్టి దుర్గము - నే నమ్ము ఆయుధంబు -
సంప్రాప్తమైన కష్టము - లనన్నిటి నణంచు - 
ఆ పాత శత్రు - వెంతో క్రూరుఁడు - 
తదాయుధము - లుపాయ శక్తులు - 
అతం డసమానుండు

2.మేమో నశించిపోదుము - మా శక్తి నిష్ఫలంబు-
మాకై ప్రభుని శూరుఁడు - యుద్ధంబు చేసిపెట్టు - 
అతం డెవ్వఁడు - యేసు క్రీస్తను - 
మా రక్షకుండు - మరొక్కఁ డెవ్వడు - 
ఆతండె గెల్పుపొందు.

3.ప్రపంచ మంతటన్ గ్రమ్ము - పిశాచు లేమి చేయు
మమ్మెల్ల బ్రంగనున్నను - మాకేల భీతివేయు - 
ఈ లోకాధిపుఁ - డుగ్రుఁడైనను - 
దానేమి చేయుఁ - దీర్పొందె నతఁడు - 
నశించు మాటతోనే.

4.వాక్యంబు నిత్యమే గదా - విరోధి వంచ లేఁడు -
దైవాత్మ తోడగుం గదా - తా నిన్న నేఁడు రేపు - 
మా కుటుంబము - మా కీర్తి , యాస్తి - 
ప్రాణంబు పోయినన్ - నష్టంబు వానిదె - 
రాజ్యంబు మాది యౌను
                               – మార్టిన్ లూథర్ 
                                అను: ఈ . పాల్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...