Showing posts with label నేమారిపోయినా నీవు మారనన్నావు. Show all posts
Showing posts with label నేమారిపోయినా నీవు మారనన్నావు. Show all posts

22 October 2023

Ne maripoyina neevu maranannavu నే మారిపోయినా నీవు మారనన్నావు


నేమారిపోయినా నీవు మారనన్నావు 
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)
ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం (2) వర్ణించలేను నీ ప్రేమను - వివరించలేను నీ ప్రేమను ||నేమారి||

1.నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు -
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2)
నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి (2)
నా మదిని గెలిచావు నా దైవమైనావు (2) ||నేమారి||

2.నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు 
నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు (2)
నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2)
నా హ్రుదిలొ నిలిచావు - నా తండ్రివైనావు (2)

3.నేనేమి అడగకున్నా నాకన్ని యిచ్చావు - ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2) ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2)
నన్ను నీకొరకే - అర్పించుకొందును (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...