Showing posts with label Nirantharam Neethone Jeevinchalani lyrics. Show all posts
Showing posts with label Nirantharam Neethone Jeevinchalani lyrics. Show all posts

30 March 2021

Nirantharam Neethone Jeevinchalani | నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా
                            || నిరంతరం ||
1. చీకటిలో నేనున్నప్పుడు- 
    నీ వెలుగు నాపై ఉదయించెను(2)
    నీలోనే నేను వెలగాలని - 
    నీ మహిమ నాలో నిలవాలని(2)
    పరిశుద్ధాత్మ అభిషేకముతో - 
    నన్ను నింపుచున్నావు - నీరాకడకై
                            || నిరంతరం ||
2. నీ రూపము నేను కోల్పోయినా - 
    నీ రక్తముతో కడిగితివి (2)
    నీతోనే నేను నడవాలని - 
    నీ వలెనే నేను మారాలని (2)
    పరిశుద్ధాత్మ వరములతో - 
    అలంకరించుచున్నావు - నీరాకడకై
                            || నిరంతరం ||
3. తొలకరి వర్షపు జల్లులలో - 
    నీ పొలములోనే నాటితివి
    నీలోనే చిగురించాలని - 
    నీలోనే పుష్పించాలని (2)
    పరిశుద్ధాత్మ వర్షముతో -
    సిద్ద పరచుచున్నావు - నీరాకడకై
                            || నిరంతరం ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...