Showing posts with label Sree Yesu Karthanu Seva Cheyutaku. Show all posts
Showing posts with label Sree Yesu Karthanu Seva Cheyutaku. Show all posts

17 August 2021

Sree yesu karthanu seva Cheyutaku | శ్రీ యేసు కర్తను సేవ జేయుటకు

43
ప్రాతఃకాల స్తుతి
రా - యమునాకళ్యాణి, తా - రూపకము

శ్రీ యేసు కర్తను - సేవఁ జేయుటకు మేల్కొను - శ్రీయేసు కర్తను - శ్రేయముల నెటింగి - నీకు రేయిపవ లొసంగి - యెడఁ - బాయని యంత రంగి - య - పాయంబుఁ ద్రోయ స హాయంబుఁజేయ ||శ్రీ యేసు||

1.నిదురయందు నేఁడు - క్షేమ - మొదవఁ గాచినాఁడు - సూర్యుఁ - డుదయ మాయెఁజూడు - నీ - హృదయమున సదమల - పదవులుదయింప ||శ్రీ యేసు||

2.అంధకార మణఁగెన్ హృద - యాంధకార మణఁగన్ - ప్రభు - నందుఁ దెలివి గలుగన్ ని - బంధనలు డెందమున - కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||

3.కంటిపాప వలెను - నిను - గాయువాని దయను - గను - గొంటివి స్తోత్రమును - జేయు - మింటి కినిమంటిక - న్నింటికిని కర్త యని || శ్రీ యేసు ||

4.కలకల ధ్వనిఁజేయు - పక్కి - గములు లయను గూయు - స్వర - ములు ప్రభు స్తుతిఁజేయు - నీ - వలయక సొలయక వెలయఁగఁ బాడు || శ్రీ యేసు ||

5.సేవయందు నీకు - మంచి - యీవు లిడుపరాకు - గల - భావముఁబడఁ బోకు - నేడుఁ - కానవే కావవేే - కావవే యంచు ||శ్రీ యేసు||

6.పగటివార మంచు - ని - ష్ఫలపు గ్రియలు ద్రుంచు - యుగ - యుగములు జీవించు - పురి - కెగయ నీ దిగులు విడు - తగు నమ్మకమున ||శ్రీ యేసు||

7.మింటి నంటఁ బాడు - నీ - యొంటి బలిమి నేఁడు - ప్రభు నంటి యుండ వాఁడు ని - న్నొంటి నెన్నంటి కె - న్నింటికి స్వీడఁడు ||శ్రీ యేసు||
                                     – బేతాళ జాన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...