Showing posts with label yesanna songs lyrics. Show all posts
Showing posts with label yesanna songs lyrics. Show all posts

16 May 2021

Deva Ma Prarthana Vinava | దేవా మా ప్రార్థన వినవా ఆవేదన

దేవా మా ప్రార్థన వినవా - ఆవేదన ఆలకించవా (2)
నీ ప్రజల కన్నీరు చూసి - దాటి వేళ్ళకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే - ఆశ్రయమైన దేవుడవు
                                                     ||దేవా||
సూర్యుడే లేక వేకువ రాదే - కెరటాలు లేక సాగరము కాదే - నీవు లేక జీవించగాగలమా (2)
కానరాక వ్యాధి మూలం - దేశమంతా శిలగామారే
కనులకాంతి చీకటాయే - దేశ శాంతి మూగబోయే
జనుల ఘోష గగనమంటే - ఘోర శిక్ష భారమయే 
నీవే రావా కన్నీరు చూసి - రక్షించుము మా దేశమును(2) దయ చూపవ యేసయ్యా..                                                                    ||దేవా||

Vinarandi Na Priyuni lyrics | వినరండి నా ప్రియుని విశేషము

వినరండి నా ప్రియుని విశేషము (2)
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
వినరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు 
 
నా ప్రియుని నీడలో చేరితిని - ప్రేమకు రూపము చూసితిని (2) 
ఆహా ! ఎంతో మనసంతా ఇక ఆనందమే 
తనువంతా పులకించే మహదానందమే ||వినరండి||
 
మహిమతో నిండిన వీధులలో - బూరలు మ్రోగే ఆకాశపందిరిలో (2) 
జతగా చేరెదను ఆ సన్నిధిలో 
కురిసే చిరుజల్లె ప్రేమామృతము 
నా ప్రియ యేసు నను చూసి దరిచేరునే 
జతగా చేరెదను ఆ సన్నిధిలో 
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను 
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||

జగతికి రూపము లేనప్పుడు - కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని 
కృపనే జయధ్వనితో కీర్తించెదను 
నా ప్రభు యేసు చెంతన చేరెదను 
స్తుతినే వస్త్రముగా ధరించుకొని 
నా ప్రభు యేసు చెంతన చేరెదను 
యుగమొక క్షణముగ జీవింతును 
 
వినరండి నా ప్రియుని విశేషము 
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
కనరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు
 
తలపుల ప్రతి మలుపు గెలుపులతో 
నిలిచే శుద్ధహృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని 
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను 
ఆ శుభవే నాకెంతో ఆనందమే 
ఫలము ప్రతిఫలము నే పొందుకొని 
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే 
నా ప్రియుని విడువను నేనెన్నడు 
 
వినరండి నా ప్రియుని విశేషము 
నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు 
కనరండి నా ప్రియుని విశేషము 
నా వరుడు సుందరుడు మహాఘనుడు  ||నా ప్రియుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

24 April 2021

Nee Mukhamu Manoharamu | నీ ముఖము మనోహరము


నీ ముఖము మనోహరము 
నీ స్వరము మాధుర్యము 
నీ పాదాలు అపరంజిమయము 

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా 
మనగలనా నిను వీడి క్షణమైనా 

నీవే నా తోడువై.. నీవే నా జీవమై -
నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై (2)
అణువణువున నీ కృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై (2)
                                   ||యేసయ్యా||
నీవే నా శైలమై.. నీవే నా శృంగమై -
నా విజయానికే నీవు భుజబలమై (2)
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు(2)
                                   ||యేసయ్యా||
నీవే వెలుగువై... నీవే ఆలయమై -
నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసెదను (2)
                                   ||యేసయ్యా||

07 April 2021

Aaradhana Sthuthi Aaradhana | ఆరాధన స్తుతి ఆరాధన మరణము

ఆరాధన స్తుతి ఆరాధన.. ఆరాధన స్తుతి ఆరాధన 
మరణము గెలిచిన నా యేసయ్య (2)
నా గానము స్తుతి జయగీతము 
నీవే నా గానము స్తుతి జయగీతము(2)

1. యేసయ్యా.. ఘోర సిలువలో నీ ప్రాణ త్యాగమే -
    చచ్చిన నాకిలా ఊపిరి పోసినే (2)
    నీవే నాజీవము నీవేనా వెలుగు (2)
    ఒక్క క్షణమైన నిను వీడి నేబ్రతుకలేను (2)
    నీవే నా ఆత్మ దీపమును వెలిగించిన -
    జ్యోతిర్మయుడవు (2)
                                          ||ఆరాధన||
2. యేసయ్యా.. నన్ను విడిపించిన విమోచకుడా -
    నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడా (2)
    నీవే నా ధైర్యము నీవే నా బలము (2)
    ఒక్క క్షణమైన నినువీడి నేనుండలేను (2)
    కన్నులారా చూచితిని నీ ఆశ్చర్య కార్యములు (2)
                                          ||ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

04 April 2021

Yevaru sameepinchaleni tejassulo | ఎవరూ సమీపించలేని తేజస్సులో

ఎవరూ సమీపించలేని - తేజస్సుతో - నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు - నా కంటబడగానే (2)
ఏమౌదునో నే నేమౌదునో (2)

ఇహలోక బంధాలు మరచి - నీ యెదుటే నేను నిలిచి(2)
నీవీచ్చు బహుమతులు నే స్వీకరించి - నిత్యానందముతో పరవశించువేళ (2) ||ఏమౌదునో||

పరలోక మహిమను తలచి - నీపాద పద్మములపై ఒరిగి(2)
పరలోక సైన్య సమూహాలతో కలసి - నిత్యారాధన నేచేయు ప్రశాంతవేళ (2) ||ఏమౌదునో||

జయించిన వారితో కలిసి - నీ సింహాసనము నే చేరగా(2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో - నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభవేళ (2) ||ఏమౌదునో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Yesayya Naa Priya Yepudo | యేసయ్యా నా ప్రియా ఎపుడో

యేసయ్యా నాప్రియా... ఎపుడో నీ రాకడ సమయం 
 
1. దురవస్థలలో ఒంటరినై - దుమికి ధూళిగా మారినను (2)
దూరాన నీముఖ దర్శనము - ధృవతారగ నాలో వెలిగెనే(2)  || యేసయ్యా ||

2. మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో (2) 
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను (2) || యేసయ్యా ||

3. ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని - ప్రియమార నామది కోరెనే (2) || యేసయ్యా ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Yeguruchunnadhi Vijaya Pathakam | ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును (2)
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం

1.యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది (2)
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే (2)

2.దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం (2)
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం (2)

3.మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా (2)
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Uthsaha Ganamu Chesedamu | ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)
 
1. అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||
 
2. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)  ||హల్లెలూయ||

01 April 2021

Sarvanga Sundara Sadhguna | సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా

సర్వాంగ సుందరా సద్గుణశేఖరా 
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెద 
పరవశించి పాడుచూ పరవళ్లు తొక్కెద 

1. నా ప్రార్థన ఆలకించువాడా -
    నా కన్నీరు తుడుచువాడా 
    నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై - 
    నాకు తోడై నిలిచితివా 

2. నా శాపములు బాపినావా - 
    నా ఆశ్రయ పురమైతివా 
    నా నిందలన్నిటిలో యెహోషపాతువై - 
    నాకు న్యాయము తీర్చితివా 

3. నా అక్కరలు తీర్చినావా - 
    నీ రెక్కల నీడకు చేర్చినావా 
   నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై- 
   నాకు జయధ్వజమైతివా

31 March 2021

Sarvonnathuda Neeve Naku | సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము
ఎవ్వరులేరు - నాకు ఇలలో (2)
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా (2)

1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు(2) ||సర్వోన్నతుడా||

2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు(2) ||సర్వోన్నతుడా||
3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు(2) ||సర్వోన్నతుడా||

DOWNLOAD MP3 SONG HERE 👇

30 March 2021

Prabhuva Nee Kaluvari Thyagamu | ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన 
అల్పా ఓమేగా నీవైతివే (2)
                                 || ప్రభువా ||
1. నీ రక్షణయే ప్రాకారములని -
    ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
    లోకములోనుండి ననువేరు చేసినది
    నీదయా సంకల్పమే (2)
                                 || ప్రభువా ||
2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
    పరిశుద్ధాత్మను నాకొసగితివే (2)
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది
    నీ అనాది సంకల్పమే (2)
                                 || ప్రభువా ||
3. సంపూర్ణునిగా నను మార్చుటకే -
    శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే (2)
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
    నీ నిత్యసంకల్పమే (2)

Nuthana Geethamu Ne Padeda | నూతన గీతము నే పాడెదా మనోహరుడా

నూతన గీతము నే పాడెదా -మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే -
సజీవుడనై ఆరాధించెద నిన్నే

1. కొలువుచేసి ప్రేమించినావు – 
    కోరదగినది ఏముందినాలో-
    స్వార్ధ మెరుగని సాత్వీకుడా -నీకు సాటెవ్వరూ (2)
    నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను (2)
                                             ||నూతన||
2. కడలి తీరం కనబడనివేళ -
    కడలి కెరటాలు వేధించువేళ -
    కరుణమూర్తిగా దిగివచ్చినా  నీకు సాటెవ్వరూ (2)
    నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ (2)
                                             ||నూతన||
3. మేఘములలో నీటిని దాచి – 
    సంద్రములలో మార్గము చూపి -
    మంటిఘటములో మహిమాత్మ నింపిన -
    నీకు సాటెవ్వరూ(2)
    నీవేనా విజయమూ –నీ మహిమయే నా గమ్యమూ (2)                                                   ||నూతన||

Ninna Nedu Nirantharam Marane | నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2)

1. యేసయ్యా నీ ప్రత్యక్షతలో
    బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)
    విడువదే నన్నెల్లప్పుడూ కృప
    విజయపథమున నడిపించెనే కృప (2)
    విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు
                                         ||నిన్న||

2. యేసయ్యా నీ కృపాతిశయము
    ఆదరించెనే శాశ్వత జీవముకై (2)
    మరువదే నన్నెల్లప్పుడూ కృప
    మాణిక్య మణులను మరిపించేనే కృప (2)
    మైమరచితినే నీ కృప తలంచినప్పుడు
                                        ||నిన్న||
3. యేసయ్యా నీ మహిమైశ్వర్యము
    చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)
    ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
    శాంతి సమరము చేసెనే కృప (2)
    మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే
                                        ||నిన్న||

Nenu Velle Maargamu Naa Yesuke | నేను వెళ్ళే మార్గము నా యేసుకే

నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను(2) 
                                              ||నేను||
1.కడలేని కడలి తీరము -
   ఎడమాయె కడకు నా బ్రతుకున(2)
   గురిలేని తరుణాన వెరువగ - 
   నాదరినే నిలిచేవ నాప్రభు
   హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

2. జలములలోబడి నే వెళ్లినా- 
    అవి నా మీద పారవు(2)
    అగ్నిలో నేను నడచినా - 
    జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

3. విశ్వాస నావ సాగుచు- 
    పయనించు సమయాన నా ప్రభు(2)
    సాతాను సుడిగాలి రేపగా -
    నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

Neeve Krupadharamu Treeyeka Deva | నీవే కృపాదారము త్రియేక దేవా

నీవే కృపాదారము త్రియేక దేవా
నీవే క్షేమాదారము నా యేసయ్య (2)
నూతన బలమును నవనూతన కృపను (2)
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
                                           ||నీవే కృపా||
1. ఆనందించితిని అనురాగబంధాల
    ఆశ్రయపురమైన నీలో నేను (2)
    ఆకర్షించితిని ఆకాశముకంటే
    ఉన్నతమైననీ ప్రేమను చూపి (2)
    ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
                                          ||నీవే కృపా||
2. సర్వకృపానిధి సీయోను పురవాసి
    నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి (2)
    సిలువను మోయుచు నీ చిత్తమును
    నెరవేర్చెదను సహనముకలిగి (2)
    శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
                                          ||నీవే కృపా||
3. ప్రాకారములను దాటించితివి
    ప్రార్థన వినెడి పావనమూర్తివి (2)
    పరిశుద్దులతో నన్ను నిలిపితివి
    నీ కార్యములను నూతన పరచి (2)
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా 
                                          ||నీవే కృపా||

29 March 2021

Neeti Vagula Koraku Duppi | నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నాప్రాణమా నాసమస్తమా - ప్రభుని స్తుతియించుమా 
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2)
నా ప్రాణమా నా సమస్తమా

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి -
    క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2)
    నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి (2)
    నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
    నే వెంబడింతు ప్రభు 
                                        ||నా ప్రాణమా||
2. అంధకారపు లోయలలో నేను నడచితిని -
    ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
    కంటి పాపగ నీవు నన్ను కాచితివి (2)
    కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
    ఇలలో నిన్ను కొలచెదను 
                                      ||నా ప్రాణమా||
3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు-
    ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును (2)
    నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు (2)
    నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
    నే ఇలలో జీవింతును 
                                      ||నా ప్రాణమా||

Nee Preme Nanu Aadarinchenu | నీ ప్రేమే నను ఆదరించేను

నీ ప్రేమే నను ఆదరించేను (2)
సమయోచితమైన నీకృపయే -
నన్ను దాచి కాపాడెను (2)

1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో 
    ఉదయించెను నీ కృప నా యెదలో - 
    చెదరిన మనసే నూతనమాయెనా (2)
    మనుగడయే మరో మలుపు తిరిగేనా (2)
                                            ||నీ ప్రేమే||
2. బలసూచకమైనా మందసమా నీకై 
    సజీవ యాగమై యుక్తమైన సేవకై - 
    ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా (2)
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా  (2)
                                            ||నీ ప్రేమే||

Nee Krupa Nithyamundunu | నీ కృప నిత్యముండును నీ కృప

నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)
                                        ll నీ కృపll
1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
    కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
    కృంగిన వేళలో ననులేవనెత్తిన - 
    చిరునామా నీవేగా(2)
                                         || నీ కృప ||
2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
    ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
    ప్రతికూలమైన పరిస్థితిలన్నియు -    
   కనుమరుగైపోయెనే(2)
                                         || నీ కృప ||
3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
    నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
    రాజమార్గములో ననునడుపుచున్న -
    రారాజువు నీవేగా(2)
                                       || నీ కృప ||

DOWNLOAD MP3 SONG HERE 👇

Naalo Nivasinche Naa Yesayya నాలో నివసించే నా యేసయ్య

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా (2)
మారని మమతల మహనీయుడ (2)
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2)  ||నాలో నివసించే||

1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం (2)
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2)  ||కీర్తించి||

3. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం (2)
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే (2)
ఏమని వర్ణింతును నీ కృపలను (2) ||కీర్తించి||

4. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)
సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము (2)
యేసయ్య నిన్ను చూచి హర్షింతును
భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం (2)  ||నాలో నివసించే||
DOWNLOAD HERE 👇

Naa Yesu Raaja Naa Aaradhya | నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా

1. నీ రథ అశ్వముగా -నీ త్యాగ బంధము - 
    నన్ను బంధించేనా.(2)
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా (2)
                                           ||నా యేసు||
2. వేటగాని ఉరినుండి -నన్ను విడిపించినా - 
     కనికర స్వరూపుడా (2)
     నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా
                                           ||నా యేసు||
3. అరణ్య యాత్రలోన - నా దాగుచోటు నీవే - 
    నా నీటి ఊట నీవే (2)
    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద
                                           ||నా యేసు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...