Showing posts with label New year songs. Show all posts
Showing posts with label New year songs. Show all posts

01 January 2022

Gathakalam antha kachavu | గతకాలం అంతా కాచావు

గతకాలం అంతా కాచావు నీ కృపలో 
వ్యధలన్ని తీరే జతలో ..... 
ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా ... 
అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ 
నూతన వత్సర కాలములో 
మెండుగ నొసగుము దీవెనలు 
సనాతన భావము తొలగించి నను నడిపించు 

హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ... 

ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? 
హృదయానికే 
నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా?
కృతాజ్ఞతే కోరెను లో లో కోరిక 
సమాస్తము చేరగ నీ పాద పీఠిక 
అందించు నీ హస్తమే దయ నే కోరగ
సంధించు నీ వాక్యమే బ్రతుకే మారగ 
హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ...

నీ శక్తినే నే పొందగ దిన దినమున దీవించుము 
నీ భక్తిలో నేర్పించుము సన్మార్గము 
సహాయమై శ్రేయమై నన్నే చేరగ 
సునంద సంధ్య రాగ మాల గీతం పాడగ 
చలించదా? జ్వలించి నామనసే నిండుగ 
జనించనా? ఫలించి నీలో రోజూ కొత్తగ 
హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ...

31 December 2021

Gathakaalamantha kaachi | గతకాలమంతా కాచి

గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి (2)
నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్యల్యము చూపితివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)

1.సీయోను కొండలపై హెర్మోను మంచువలే నీదీవేనలు మాపై కురుపించితివి (2)
నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది (2)
నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - 
మా దాగుచోటు నీవే యేసయ్యా (2) || గత ||

2.మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి (2) 
దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి (2) 
నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి - 2 
మా బలము నీవే - మా భాగ్యము నీవే - 
మా దాగుచోటు నీవే యేసయ్యా (2)

05 December 2021

Nuthana Samvathsaramulo | నూతన సంవత్సరములో

నూతన సంవత్సరములో - నూతన అభిషేకముతో(2)
నింపుము నా యేసయ్యా - నీ సేవను చేయగను (2) ||నూతన|| 

1. (ఆ) ఎండిన నేలపై వర్షము కురిపించి జీవనదిలా నాలో ప్రవహించి (2)
రోత బ్రతుకును ఇకను తొలగించి (2)
నూతన సృష్టిగా నను మార్చుమయా (2) ||నూతన||

2. (ఆ) ఆత్మలకొరకైన భారము నిమ్ము - ప్రార్ధించే కృప అనుదినమిమ్ము (2)
నీదు వార్తను ప్రకటించుటకు (2)
నూతన ద్వారములు తెరువుము దేవా (2) ||నూతన||

3. నీ వాగ్ధానములు నాలో నెరవేర్చు నిత్యము వాక్యముతో నన్ను బ్రతికించు (2)
నీ సన్నిధిని నాతోడుగా ఉంచి (2)
నడిపించుము నన్ను నిరతము యేసయ్య (2) ||నూతన||

DOWNLOAD MP3 SONG HERE 👇

05 January 2021

Gadachina Kaalam Krupalo | గడచిన కాలము కృపలో మమ్ము


గడచిన కాలము కృపలో మమ్ము - 
దాచిన దేవా నీకే స్తోత్రము -
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2) 
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున - కన్న తండ్రివైనను ఆదరించిన -
కలుషము నాలో కానవచ్చినా - కాదనక నను కరుణించిన (2) 
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను - ధాతృత్వముతో నను నడిపించినా -
అవిధేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసిన (2) 
దీవించిన దేవా నీకే స్తోత్రము - దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||
DOWNLOAD MP3 SONG HERE 👇

05 July 2020

Krotha yedu modalu | క్రొత్త యేడు మొదలు

603
క్రొత్త సంవత్సరము
రా - కాంభోజి, తా - త్రిపుట

క్రొత్త యేడు మొదలు బెట్టెను - మన బ్రతుకునందు - క్రొత్త యేడు మొదలు బెట్టెను = క్రొత్తమనసు తోడ మీరు - క్రొత్త యేట బ్రభుని సేవ - దత్తర పడకుండ జేయు - టుత్త మోత్తమంబు  జూడ ||క్రొత్త||

1.పొంది యున్న మేలు లన్నియు బొంకంబు మీఱ - డెందమందు స్మరణజేయుడీ = యిందు మీరు మొదలు బెట్టు - పందెమందు గెల్వ వలయు - నంద ముగను రవిని బోలి - నలయకుండ మెలయ కుండ ||క్రొత్త||

2.మేలు సేయ దడ వొనర్పగా - మీరెఱుగునట్లు  కాలమంత నిరుడు గడచెగా = ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయు - జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొఱకు ||క్రొత్త|| 

3.బలము లేని వార మయ్యును - బల మొంద వచ్చు - గలిమి మీఱ - గర్త వాక్కును = నలయకుండ నడుగుచుండ - నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల - నెలమి మీరొనర్చు చుండ ||క్రొత్త||

4.ఇద్ధరిత్రి నుండు నప్పుడే- యీశ్వరుని జనులు - వృద్ధిబొంద జూడ వలయును = బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధ జేయ - శుద్ధు లైన వారిలో ప్ర - సిద్దులగుచు వెలుగవచ్చు ||క్రొత్త||

5.పాపపంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తు యేసు - ప్రాపు జేరి మీరు వేడగా = నేపు మీఱ దనదు కరుణ - బాప మంత గడిగివేసి - పాప రోగ చిహ్న లన్ని - బాపివేసి శుద్ధి జేయు IIక్రొత్త||
- పులిపాక జగన్నాధము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...