Showing posts with label Athi parishudhuda sthuthi. Show all posts
Showing posts with label Athi parishudhuda sthuthi. Show all posts

02 January 2023

Athi parishududa sthuthi | అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము


అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును 
నీవు నా పక్షమై నను దీవించగా -నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే -ఆశ్రయమైన నా యేసయ్యా
 
సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా 
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
 
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని 
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే 
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా 
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
 
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక 
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమున కలిసి ఉన్నావులె ప్రతి అడుగున 
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...