Showing posts with label నా పేరే తెలియని ప్రజలు. Show all posts
Showing posts with label నా పేరే తెలియని ప్రజలు. Show all posts

04 August 2020

Na pere theliyani prajalu | నా పేరే తెలియని ప్రజలు

నా పేరే తెలియని ప్రజలు ఎందరో వున్నారు 
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు 
ఎవరైనా - మీలో ఒకరైనా - 
వెళతారా - నా ప్రేమను చెబుతారా (2) ||నాపేరే||

1. నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు
మీరైనా - మీలో ఒకరైనా (2)
వెళతారా నా ప్రేమను చెబుతారా (2) ||నాపేరే||
 
2. రక్షణ పొందని ప్రజలు లక్షలకొలదిగ ఉన్నారు
మారుమూల గ్రామములో ఊరి వెలుపలి వీధుల్లో
ఎవరైనా - మీలో ఎవరైనా (2)
వెళతారా నా ప్రేమను చెబుతారా (2) ||నాపేరే||
 
3. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే - వెళ్ళే వారిని పంపండి
ఎవరైనా - మీలో ఎవరైనా (2)
వెళతారా నా ప్రేమను చెబుతారా (2)||నాపేరే||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...