Showing posts with label Naa hrudayamulo nee matale lyrics. Show all posts
Showing posts with label Naa hrudayamulo nee matale lyrics. Show all posts

29 March 2021

Naa hrudayamulo nee matale | నా హృదయములో నీ మాటలే

నా హృదయములో నీ మాటలే -
నా కనులకు కాంతిరేఖలు (2) 
కారు చీకటిలో కలువరి కిరణమై 
కఠినహృదయమును కరిగించినావు 
నీ కార్యములను వివరింపతరమా 
నీ ఘనకార్యములు వర్ణింపతరమా

1.మనసులో నెమ్మదిని కలిగించుటకు - 
మంచువలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టివేసి -
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువగల భూమిగా మార్చినావు ||నీ కార్యముల||

2.విరజిమ్మె ఉదయకాంతిలో -
నిరీక్షణ ధైర్యమును కలిగించితివి (2)
అగ్నిశోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్థంభముపై నను నిలిపినావు ||నీ కార్యముల||

3.పవిత్రురాలైన కన్యకగా -
పరిశుద్ధ జీవితం చేయుటకు (2)
పావన రక్తముతోకడిగి -
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి - 
సుగుణాల సన్నిధిలో ననునిలిపినావు ||నీ కార్యముల||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...