Showing posts with label Taluku Taluku tara minuka. Show all posts
Showing posts with label Taluku Taluku tara minuka. Show all posts

09 December 2021

Taluku Taluku Thara Minuka | తళుకు తళుకు తార మిణుకు

తళుకు తళుకు తార మిణుకు మిణుకుమంటు
ఆకాశంలో వెలిగిందిలే వెలుగులు చిమ్మిందిలే
రక్షకుడు యేసు భువిని పుట్టెనంటు 
నక్షత్రం తెలిపిందిలే చీకటిని తరిమిందిలే 
అహా అహా ఆనందం ఒహో ఒహో సంతోషం 
దివిలో భువిలో ప్రతి హృదిలో 
ఆరాధన మన యేసయ్యకే 
ఆనందము మన యేసయ్యలో 

మనసంతా ఉల్లాసం మదినిండా ఉత్సాహం
గంతులేసి ఆటలాడుదాం 
రక్షకుడు మనకోసం రక్షణ మన సొంతం 
అంతా కలిసి పాట పాడుదాం 
మన పాపము శాపము తీసేందుకే 
మనిషిగ పుట్టెను మన యేసయ్య 
అహా అహా ఆనందం ఒహో ఒహో సంతోషం 
దివిలో భువిలో ప్రతి హృదిలో 
ఆరాధన మన యేసయ్యకే 
ఆనందము మన యేసయ్యలో 

పరలోకపు రారాజు ఇహలోకపు దాసునిగ 
పుట్టినాడు పశులపాకలో 
మనసున్న మారాజు మహిమగల మహనీయుడు
పుట్టినాడు బెత్లహేములో 
మన మరణము నరకము తీసేందుకే 
మనిషిగ పుట్టెను మన యేసయ్య 
అహా అహా ఆనందం ఒహో ఒహో సంతోషం 
దివిలో భువిలో ప్రతి హృదిలో 
ఆరాధన మన యేసయ్యకే 
ఆనందము మన యేసయ్యలో

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...