Showing posts with label ఐజక్ వాట్స్. Show all posts
Showing posts with label ఐజక్ వాట్స్. Show all posts

18 March 2022

Mahathmudaina naa prabhu | మహాత్ముఁడైన నా ప్రభు

212  When I survey the wondrous Cross

1.మహాత్ముఁడైన నా ప్రభు 
విచిత్ర సిల్వఁ జూడ నా 
యాస్తిన్ నష్టంబుగా నెంచి 
గర్వం బణంగఁ ద్రొక్కుదున్.

2.నీ సిల్వ గాక యో దేవా 
దేనిన్ బ్రేమింప నీయకు 
నన్నాహరించు సర్వమున్ 
నీ సిల్వకై త్యజింతును.

3.శిరంబు పాద హస్తముల్ 
నూచించు దుఃఖ ప్రేమలు 
మరెన్నడైన గూడెనా 
విషాదప్రేమ లీ గతిన్?

4.ముండ్లన్ దుర్మార్గులల్లిన 
కిరీట మేసు కుండినన్ 
ఈ భూకిరీటములన్నీ 
దానం దూగంగఁ జాలు నే?

5.లోకంబు నే నర్పించిన 
నయోగ్యమైన యీవి యౌ 
వింతైన యేసు ప్రేమకై 
నా యావజ్జీవ మిత్తును.

6.రక్షింపఁ బడ్డ లోకమా 
రక్షింపఁ జావుఁ బొందిన 
రక్షకుఁ డేసునిన్ సదా 
రావంబుతోడఁ గొల్వుమా
               – ఐజక్ వాట్స్
   అను: ఎచ్. హెన్రీ డేవిస్

16 August 2021

Ennaallu maaku sayamai ఇన్నాళ్లు మాకు సాయమై యీ

35
O God our help in ages past

1.ఇన్నాళ్లు మాకు సాయమై- యీ ముందుకును మా
యున్నత గృహ మండవై - యొప్పెడు దైవమా!

2.ఏలాటి యీతిబాధయు - నీవచ్చు యేఁటిలో
కలుగకుండఁ బ్రోవవే - ఘనంపు ప్రేమతో

3.నీ సింహాసన నీడలో - నిలుచు భక్తులు 
భయంబు చింతబాధలన్ - జయించి మదురు

4.చరాచరంబు లెల్లను - జనించుకంటె మున్ 
దరతరాలనుండియున్ - నీరాజ్య ముండెడున్

5.ఇన్నాళ్లు మాకు సాయమై - యేలుచుఁ గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో - మన్నించు మింకను.
                                 - ఐజక్ వాట్స్
      అను : ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు సామర్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...