Showing posts with label 575 సంతోషముతో నిచ్చెడు వారిని. Show all posts
Showing posts with label 575 సంతోషముతో నిచ్చెడు వారిని. Show all posts

13 October 2024

Santhshamutho nichedu varini సంతోషముతో నిచ్చెడు వారిని

 575
క్రైస్తవ దాతృత్వము 
రా -సౌ రాష్ట్ర,  తా - ఆది 
(చాయ: మనసా నందము బొందుటకన్నను)

సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుఁడు ప్రేమించున్ = వింతగ వలసిన - దంతయు నొసంగును - వినయ మనసుగల - విశ్వాసులకును ||సంతోషముతో||

1.అత్యాసక్తితో నధికప్రేమతో - నంధకార జను లందఱకు = సత్య సువార్తను - జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు ||సంతోషముతో||

2.వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు - బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||

4.దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిఁ దీర్చుటకై = నిక్కపు రక్షణ - నిద్ధరలో నలు - ప్రక్కలలోఁ బ్రక -టించుట కొఱకై ||సంతోషముతో||

5.ఇయ్యండీ మీ కీయం బడు నని - యియ్యంగల ప్రభు యే సనెను = ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియ్యవలెను మన - యీవుల నిఁకను ||సంతోషముతో||

6.భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు - యుక్త మటంచు ను = దారతతో - శక్తికొలఁది మన భుక్తి నుండి యా - సక్తితో నిరతము - నియ్య వలెను ||సంతోషముతో||
మోచర్ల రాఘవయ్య

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...