Showing posts with label Arpinthu Sthuthul Nee Siluvalo lyrics. Show all posts
Showing posts with label Arpinthu Sthuthul Nee Siluvalo lyrics. Show all posts

02 May 2021

Arpinthu Sthuthul Nee Siluvalo | అర్పింతు స్తుతుల్ నీ సిలువలో

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి ||అర్పింతు||

1.తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి (2)
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా (2) ||అర్పింతు||

2.నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం (2)
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో (2) ||అర్పింతు||

3.నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు(2)
ఆనంద బాష్ప ములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే (2) ||అర్పింతు||

4.నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్ (2)
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను (2) ||అర్పింతు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...