Showing posts with label బంగారు బొమ్మ నీవమ్మా వధువు. Show all posts
Showing posts with label బంగారు బొమ్మ నీవమ్మా వధువు. Show all posts

13 April 2021

Bangaru Bomma Neevamma | బంగారు బొమ్మ నీవమ్మా వధువు

 
బంగారు బొమ్మ నీవమ్మా -
వధువు సంగమా రావమ్మా (2)
శృంగార ప్రభువు యేసమ్మా -
వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా(2)

1. పశ్చాత్తాపమే పెళ్లి చూపులమ్మా
    పాప క్షమాపణ నిర్చితార్ధమమ్మా
    విరిగిన మనస్సే వరుని కట్నమమ్మా
    నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
    గొరియ పిల్ల రక్తములో తడిసిన
    పవిత్ర కన్యవై నిలిచేవమ్మా (2)
                                       ||బంగారు||
2. కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా
    అసూయా ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా
    నెత్తుటి దారాలే పెళ్లి చీరమ్మా
    ముళ్ళ కిరిటమే పెళ్లి ముసుగమ్మా
    ప్రకాశమయమై నిర్మలమైన
    పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా (2)
                                      ||బంగారు||
3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా
    దేవుని దూతలే పెళ్లి సాక్షులమ్మా
    సిలువ దండమే పెళ్లి సూత్రమమ్మా
    దూషణ హేళనే పెళ్లి అక్షింతలమ్మా
    సువర్ణమయమై స్వచ్చమైన
    స్పటికమువోలే మెరిసేవమ్మా (2)
                                      ||బంగారు||
==========================

09 October 2020

Bangaru Bomma Neevamma | బంగారు బొమ్మ నీవమ్మా వధువు

బంగారు బొమ్మవు నీవమ్మా 
వధువు సంఘమారావమ్మా 
శృంగార ప్రభువు యేసమ్మ 
వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ

1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా- 
    పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా 
    విరిగిన మనసే వరుని కట్నమమ్మా- 
    నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా 
    గొరియ పిల్ల రక్తములొ తడిచిన - 
    పవిత్ర కన్యవై నిలచేవమ్మా(2)         ||బంగారు||

2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా- 
    అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా 
    నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా - 
    ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా 
    ప్రకాశమయమై నిర్మలమైన
    పరిశుద్ధల క్రియలై నడిచేవమ్మా(2)   ||బంగారు||

3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా - 
    దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా 
    సిలువ దండమే పెండ్లి సూత్రమమ్మా - 
    దూషణ హేళనే పెండ్లి అక్షింతలమ్మా 
    సువర్ణమయమై స్వచ్చమైన 
    స్పటికమువలే మెరిసేవమ్మా(2)     ||బంగారు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...