Showing posts with label అనుభవానికి వచ్చెనా అంతులేని. Show all posts
Showing posts with label అనుభవానికి వచ్చెనా అంతులేని. Show all posts

13 April 2021

Anubhavaniki Vachena Anthuleni | అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన

అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన...
దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా...

అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన -
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)

మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే
ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||

రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన 
కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2)
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||

మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి
ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) ||అనుభవానికి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...