Showing posts with label Sree Yesune Bhajinchu Naa Manasa. Show all posts
Showing posts with label Sree Yesune Bhajinchu Naa Manasa. Show all posts

19 August 2021

Sree Yesune Bhajinchu Naa Manasa | శ్రీ యేసునే భజించు నా మనసా

79                         యేసు భజన
రా – జంఝూటి                              తా – ఆది
                  
శ్రీ యేసునే – భజించు – నా మనసా – శ్రీ యేసునే భజించు = శ్రీ యేసు ప్రభునే భజించు – నా మనసా – శ్రీ యేసునే భజించు || శ్రీ యేసు ||

1. యేసు త్రిత్వమం – దీశ కుమారుఁడు = భాసురుఁ డాతఁడు - భూషిత రక్షకుఁడు || శ్రీ యేసు ||

2. నరుల దురిత స్థితిఁ – గరుణించి వారికిఁ = పరమ సుఖము లిడ – పరికించి వచ్చిన || శ్రీ యేసు ||

3. స్వామికి మహిమయు – భూమికి నెమ్మది = క్షేమము నియ్యను – లేమిడిఁ బుట్టిన || శ్రీ యేసు ||

4. నరులను తండ్రితో – నైక్యము జేయగ నిరతము వేఁడెడి – నిజప్రాపకుఁ డగు || శ్రీ యేసు ||

5. మూఁడవ దినమున – మృత్యువు నోడించి = తడయక పునరు – ద్ధానము నొందిన || శ్రీ యేసు ||
                                   - యెషయా వీరమార్టిన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...