Showing posts with label స్తోత్రించెదను స్తోత్రించెదను. Show all posts
Showing posts with label స్తోత్రించెదను స్తోత్రించెదను. Show all posts

18 November 2020

Sthotrinchedamu Sthotrinchedamu | స్తోత్రించెదను స్తోత్రించెదను

స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా 
మాజీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను ||స్తోత్రించె||

1.ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
యేడు దీపంబులమధ్య - సంచరించువాడా ||స్తోత్రించె||

2.మొదటివాడా కడపటివాడా - మృతుడైన వాడా
మృతిని గెల్చిలేచిన వాడా- మది నిను దలచెదను ||స్తోత్రించె||

3.వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమపురివాస ||స్తోత్రించె||

4.అగ్ని జ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా
అపరంజిని బోలిన పాదములు- దేవుని కుమార ||స్తోత్రించె||

5.ఏడు నక్షత్రములు- దేవుని ఏడాత్మలునూ కలిగినవాడా
కరుణించి మము - కాపాడుమయ్యా ||స్తోత్రించె||

6.దావీదు తాళపు చెవిని - బడసినవాడా 
సత్యస్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా ||స్తోత్రించె||

7.ఆమెన్ అను వాడా - నమ్మకమైన నాధుండా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా ||స్తోత్రించె||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...