Showing posts with label నీ కృప నిత్యముండును నీ కృప. Show all posts
Showing posts with label నీ కృప నిత్యముండును నీ కృప. Show all posts

29 March 2021

Nee Krupa Nithyamundunu | నీ కృప నిత్యముండును నీ కృప

నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)
                                        ll నీ కృపll
1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
    కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
    కృంగిన వేళలో ననులేవనెత్తిన - 
    చిరునామా నీవేగా(2)
                                         || నీ కృప ||
2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
    ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
    ప్రతికూలమైన పరిస్థితిలన్నియు -    
   కనుమరుగైపోయెనే(2)
                                         || నీ కృప ||
3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
    నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
    రాజమార్గములో ననునడుపుచున్న -
    రారాజువు నీవేగా(2)
                                       || నీ కృప ||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...