Showing posts with label Nee jeevithamulo gamyabu. Show all posts
Showing posts with label Nee jeevithamulo gamyabu. Show all posts

25 April 2022

Nee jeevithamulo gamyabu | నీ జీవితములో గమ్యంబు ఏదో

నీ జీవితములో గమ్యంబు ఏదో - 
ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు - 
నీ హృదయ మర్పించవా?

నీ తల్లి గర్బమున నీ వుండినపుడే - 
నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించి నావా ఏరీతి నిన్ను - 
నిర్మించే తన చేతులు ||నీ జీవిత||

నీ లోన తాను నివసింపగోరి - 
దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు - 
తెరువంగ లేవా యేసు ప్రవేశింపను ||నీ జీవిత||

తన చేతులందు హృదయంబు ధారల్‌ - 
స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష నీ కోసమేగా - 
ఒకసారి గమనించవా ||నీ జీవిత||

ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి - 
సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక - 
పోభోకుమా సోదరా ||నీ జీవిత||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...