Showing posts with label Sri yesu rajya mundunu. Show all posts
Showing posts with label Sri yesu rajya mundunu. Show all posts

27 March 2022

Sri yesu rajya mundunu | శ్రీ యేసు రాజ్య ముండును

287
Jesus shall reign where'er the sun

1.శ్రీయేసు రాజ్య ముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల 
కల్పాంతకాల మౌదాక - ఆ రాజ్యము వ్యాపించును.

2.నిరంతరంబు ప్రార్థనల్ - నిత్య స్తుతుల్ శ్రీయేసుకు 
తన్నామము ప్రత్యహము - సుగంధ మట్లు లేచును

3.సమస్త దేశ వాసులు - గణింతు రేసు ప్రేమను 
శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున నుతింతురు.

4.యేసుని యీవు లొల్కును - ఖైదికి సంకెళ్లూడును 
డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁ పేదకున్

5.శ్రీ యేసు శక్తి చేతను - స్వస్థంబు గల్గు నెల్లెడన్ 
దచ్ఛక్తి యున్న మేరలన్ - నశించు మృత్యు శాపముల్

6.మా రాజు కెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్ 
దూతాళి మళ్లి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్
    – ఐజాక్ వాట్స్
    అను: జాన్ స్మిత్ వార్ల

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...