Showing posts with label కమ్ముకుంటు వస్తుంది కడవరి దినము. Show all posts
Showing posts with label కమ్ముకుంటు వస్తుంది కడవరి దినము. Show all posts

10 February 2021

Kammukuntu Vasthundi Kadavari | కమ్ముకుంటు వస్తుంది కడవరి దినము

కమ్ముకుంటు వస్తుంది కడవరి దినము - అయ్యో అయ్యో మనకెంతో వేదనకరము ||కమ్ము||
జనములు మీదికి జనములు లేచును - రాజ్యము మీదికి రాజ్యము లేచును (2)
భూమెండుగా కరువులు కలుగును - భూకంపములు ఎక్కువ కలుగును (2) కడు వేదనలు నీకు చెలరేగును||కమ్ము||

చీకటి సూర్యుని కమ్మేడి వేళ - చంద్రుడు కాంతిని ఇవ్వని వేళ (2)
ఆకాశ మేఘారూరుడై - ప్రకాశ ప్రభావముతో (2)
ఎటు పోయేదవు నీవు పరికించుకో.. ||కమ్ము||

ఆరని అగ్ని గుండము అదిగో - రోదన ధ్వనులు రేగెను అవిగో (2)
నాశన నరకము అదిగో - మోక్షానికి మార్గం అదిగో (2)
ఎటు పోయేదవు నీవు పరికించుకో..||కమ్ము||

ఆ దినమేదో అలయగ రాదు - ఆ గడియేదో తెలియగ రాదు (2)
కడు మెలుకువ కలిగి వినుమా - కడు హేళన చేయక కనుమ (2)- కడు వేగముగ వచ్చు ప్రభు రాకడ ||కమ్ము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...