Showing posts with label Maa Uhalu Puttaka. Show all posts
Showing posts with label Maa Uhalu Puttaka. Show all posts

17 October 2021

Maa Uhalu Puttaka | మా ఊహలు పుట్టక మునుపే


మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వము నెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీపాద సన్నిధిలో (2) ||మా ఊహలు||

1. నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు||

2. ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని(2)
ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడిదేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు - నీతోడు నీడే చాలు ||మా ఊహలు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...