Showing posts with label Naa Deepamu Yesayya Neevu lyrics. Show all posts
Showing posts with label Naa Deepamu Yesayya Neevu lyrics. Show all posts

28 March 2021

Naa deepamu yesayya neevu | నా దీపము యేసయ్యా నీవు

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము (2)

1. ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||

2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||

3. ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...