Showing posts with label పా. Show all posts
Showing posts with label పా. Show all posts

04 March 2022

Paadeda sthuthi gaanamu | పాడేద స్తుతి గానము కొనియాడేద

Hosanna Ministries 32nd Album [ Srikaruda Naa Yesayya ] Song- 3 " పాడెద స్తుతి గానము " Pas.Abraham Anna

పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము (2)
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం
అతి శ్రేష్టుడా నా యెస్సయ్యా (2) || పాడేద ||
 
1. ఇలా నాకేవ్వరు లేరనుకోనగా - నా దరి చెరితివే
 నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు (2)
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము - నా కానందమే (2)  || పాడేద ||

2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నీ రుధిర ధారలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే (2)
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను (2)
నీ అభిషేకము - పరమానందమే (2) || పాడేద ||

3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే 
నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే (2)
యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ (2)
నీ పరిచర్యలో - మహిమానందమే (2) || పాడేద ||

02 March 2022

Paapulayeda kreesthuni priya | పాపులయెడ క్రీ స్తుని ప్రియ

187
క్రీస్తును యద్భుత ప్రేమ
రా- సౌరాష్ట్ర, తా - ఆది 

పాపులయెడ క్రీ - స్తుని ప్రియ మెట్టిదో - పరికింపరె క - ల్వరిగిరిపై = నాపదలను దన - కీగతిఁ బెట్టెడు - కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||

1.యెరుషలేము క - న్యలు కొందరు తన - యెదుట వచ్చి యేడ్చుచు నిలువన్ = వరుస నప్పురికి - వచ్చు నాశన గతు - లెరుఁగఁ బలికి వా - రల నోదార్చెను ||బాపుల||

2.శత్రువు లటు తనుఁ - జంపుచు నుండఁగ - మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ = స్తోత్రముఁ జేసెను - దండ్రీ వీరల - దురిత మెల్ల క్షమి - యింపవె యనుచును ||బాపుల||

3.తన ప్రక్కను సిలు - వను వేసిన యొక - తస్కరుఁ డించుక వేఁడు కొనన్ = కనికరము మన - మునఁ బెనగొన ని - చ్చెను మోక్షము తన - తో యుండుటగున్ ||బాపుల||

4.మితిలేని దురిత = జీవుల లోపల - మించి యున్న పతితుల కైనన్ = హితముగ మోక్షం = బిచ్చుటకై శో - ణిత మిచ్చెను నా - మతి కది సాక్షిగఁ ||బాపుల||
                        – పురుషోత్తమ చౌదరి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...