Showing posts with label Devadi Devaa Prabhuvula Prabhu lyrics. Show all posts
Showing posts with label Devadi Devaa Prabhuvula Prabhu lyrics. Show all posts

31 May 2021

Devadi Devaa Prabhuvula Prabhu | దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల


దేవాది దేవా ప్రభువుల ప్రభూ 
రాజుల రాజా హల్లెలూయ 

1. నీ రక్తముతో విమోచించి - 
నీ రక్తముతో సంపాదించి 
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - 
పరలోక పాటన్ నా కొసగితివి ||దేవాది దేవా||

2.జీవిత నావలో తుఫాను రేగ - 
భయపడకుడని అభయము 
జయప్రదముగా నన్ను నడిపించి - 
జయజీవితము నా కొసగుచున్న ||దేవాది దేవా|| 

3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - 
కరుణతో నీ సొత్తుగా నన్ను 
అరమర లేక నన్నాదరించి - 
పరలోక దర్శనంబిచ్చితివి ||దేవాది దేవా||

4. మరణ పాత్రులం యిధరణిలోన - 
దురిత ఋణముల స్మరణను మాన్పి 
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - 
నీ రాజ్యమందు రాజులన్ ||దేవాది దేవా|| 

5. శోధనగాధల కష్టములలో - 
నా దుఃఖములలో నే నేడ్వకుండా 
నీ దయ నాపై నిండార నింపి - 
ఓదార్చి నన్ను నీ దారినడుప ||దేవాది దేవా|| 

6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - 
ప్రభు జాడలు సారము జల్లున్ 
ప్రతి బీడునూ సారము చిలకన్ - 
ప్రతి పర్వతము ఆనందించున్ ||దేవాది దేవా|| 

7.పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - 
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట 
పరలోక నూతన గీతము పాడ - 
జేర్చితివి నన్ నీ జనమునందు  ||దేవాది దేవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...