Showing posts with label Mathunu Veedandi Priyulaara lyrics. Show all posts
Showing posts with label Mathunu Veedandi Priyulaara lyrics. Show all posts

01 June 2021

Mathunu veedandi priyulaara | మత్తును వీడండి ప్రియులారా

మత్తును వీడండి ప్రియులారా మద్యము మానండి
చిత్తుగ తాగి సత్తువ కోల్పోయి నెత్తిన చిక్కులు తెచ్చుకొనకండి 

1.బుద్ధి మందగించునండి - శ్రద్ధ తగ్గిపోవునండి
పొద్దు గుంకగానే చేరి కొద్ది అంటూ మొదలు పెట్టి
హద్దు మీరి తాగి ఆపై మొద్దులగుట ఏలనండి 

2.రక్తమంత చెడునండి - శక్తిహీనులగుదురండి
ముక్తిదాత యేసుస్వామి సూక్తులను చెవినబెట్టి
భక్తితోడ వేడిన విముక్తినిచ్చు నిజమండి 

3.ధనము కరిగి పోవునండి - ఘనత చెరిగి పోవునండి 
జనకుడైన యేసు ప్రేమ కనక నీవు పాపముతో
పనికిమాలి కడకు నరకమునకు చేరుటేలనండి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...