Showing posts with label ప్రభు పాద సన్నిధి నాకెంతో ప్రియము. Show all posts
Showing posts with label ప్రభు పాద సన్నిధి నాకెంతో ప్రియము. Show all posts

25 July 2021

Prabhu Paada Sannidhi Nakentho | ప్రభు పాద సన్నిధి నాకెంతో ప్రియము

ప్రభు పాద సన్నిధి నా కెంతో ప్రియము - ప్రభు యేసు నామము నాకెంతో శ్రేష్టముు (2) 
అప: సన్నిధి తండ్రి సన్నిధి సర్వోన్నతుని సన్నిధి 
సన్నిధి తండ్రి సన్నిధి ఇది మహిమాన్వితుని సన్నిధి

1. దేవ నీ సన్నిధియే నాకు ఆనందం - ప్రభువా నీ సన్నిధియే నాకు ఆశ్రయము (2)
నీ దివ్య సన్నధిిలో నే నివసించెదను - నీ గొప్ప నామములో కీర్తించెదను ||సన్నిధి||

2. దేవ నీ సన్నిధియే నాకు ఆదరణ - ప్రభువా నీ సన్నిధియే నాకెంతో దీవెన (2)
నీ పాద సన్నిధియే నా జ్ఞానాధారం - నీ నామ స్మరణయే నా జీవిత భాగ్యం ||సన్నిధి||

3. దేవ నీ సన్నిధియే నా ప్రాకారము - ప్రభువా నీ సన్నిధియే నా ప్రాణాధారము (2)
నీ ఆత్మ సన్నిధియే నా పరమ జీవము - నీ కృప సన్నిధియే నా ప్రియ సహవాసం (2) ||సన్నిధి||

4. దేవ నీ సన్నిధియే నా అభిషేకం - ప్రభువా నీ సన్నిధియే నా అధికారం (2)
నీ అగ్ని సన్నిధిలో నే ప్రకాశింతును - నీ ప్రియ దాసునిగా నే జీవించెదను (2) ||సన్నిధి||

5. దేవ నీ సన్నిధియే నా క్షేమాధారము - ప్రభువా నీ సన్నిధియే నా జీవాధారము (2)
నీ ప్రేమ సన్నిధిలో నే పరవసించెద - నీ పాద సన్నిధిలో శిరస్సు వంచి మ్రొక్కెద (2) ||సన్నిధి||

6. దేవ నీ సన్నిధియే నా ఆత్మకు ప్రకాశం - ప్రభువా నీ సన్నిధియే తీర్చును నా దాహం (2)
నీ జీవ సన్నిధియే నింపును నా హృదయం - నీ పవిత్ర సన్నిధియే నా తోడై నడుపును (2)  ||సన్నిధి||

7. దేవ నీ సన్నిధియే నా పరలోకం - ప్రభువా నీ సన్నిధియే నా సమాధానము (2)
నీ సన్నిధి కాంతియే నా సౌందర్యం - తండ్రీ నీ సన్నిధియే నా ఐశ్వర్యం (2) ||సన్నిధి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...