Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

02 June 2026

ఇక నేమి గతి యున్నది మానవులారా Eka nemi gathi yunnadi maanavulaara

289
క్రీస్తే పాపుల గతి
రా - మాధ్యమావతి, తా - త్రిపుట 

ఇఁక నేమి గతి యున్నది - మానవులారా - యిఁక నేమి గతి యున్నది - పాపులకోస - మిఁక నేమి గతి యున్నది = యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ - డుర్వి లేఁడని ముందె - ప్రకటించి దావీదు - పల్కె వేదము నందు ||ఇఁక||

1.ఇల రక్షకుఁడు లేమిని - గొఱ్ఱెల మంద - లిలఁ జెల్ల చెదు రాయెను = పులులఁ బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్దతి జూప జాలరు ||ఇఁక||

2.దురితము లణఁగింపఁగఁ - బాపుల నెల్ల - దరిఁ జేర్చి బ్రతికింపగ = పర మేశ్వరుఁడు తన - వరపుత్రుఁ డగు క్రీస్తున్ - ధర కంపె నయ్యేసు - శరణుఁ జొరకయున్న ||ఇఁక||

- పురుషోత్తము చౌదరి 

31 March 2025

Idi rakshana krupa kaalam ఇది రక్షణ కృపకాలం

 
ఇది రక్షణ కృపకాలం — ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక – మనస్సు మార్చుకోనీవిక (2)

1. రాజ్యముల రాజ్యముల్ – జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్ – ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2. దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే – యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన - అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు – భక్తులకు హింసలు ||ఇది||

4. క్రైస్తవుడా మేలుకో – సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు – ఆత్మయందే బలపడు ||ఇది||

01 June 2023

Ide na korika navajivana ఇదే నా కోరిక నవజీవన


ఇదే నా కోరిక - నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక||
1.యేసు లాగ ఉండాలని - యేసుతోనే నడవాలని (2)
నిలవాలని గెలవాలని - యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక||

2.ఈ లోకంలో పరలోకము - నాలోనే నివసించాలని (2)
ఇంటా బయట యేసునాథునికే - కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక||

3.యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని (2)
క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||

Inthalone kanabadi anthalone ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే


ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే - అల్పమైన దానికా ఆరాటం
త్రాసుమీద ధూళి వంటి ఎత్తలేని నీటివంటి - స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏదీ కాదు నీ సొంతం - దాటిపోవును ఇల నీ సంపదలన్నియు

1.బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను భువినేలిన రాజులు
నాది నాది అంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా

2.మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో

31 May 2023

Intha kaalam needu krupalo ఇంత కాలం నీదు కృపలో


ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||

1.ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||

2.నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||

Inti meedanunna ontari ఇంటి మీదనున్న ఒంటరి

నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా

ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥

1.వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥

2.తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటిII
DOWNLOAD MP3 SONG HERE 👇

21 May 2023

Ishrayelu deva na sthuthula ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును (2)
ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)

ఆరాధనా నీకే ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు||

1.నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా (2)
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే (2) ||ఆరాధనా||

2.నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి -
స్తుతుల సింహాసనము నీకు వేయగా (2)
ఆనంద తైలముతో నన్నభిషేకించి -
స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) ||ఆరాధనా||

3.నా కొరకు సీయోనును సిద్ధపరచి -
మహిమతో తిరిగి రానైయుంటివే (2)
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి -
శాశ్వత జీవము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||

12 March 2023

Entha varaku neevu nannu | ఇంతవరకు నీవు నన్ను

ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏమాత్రము

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచు ఘనకార్యములు నీ దయ వలెనే

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని సింహాసనం ఎక్కించి మైమరచితివే
మందను వెంటాడి తిరుగుచుంటినే

నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని తాత్కాలిక సహాయము నే అడిగితిని యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె

11 December 2022

Enthavaraku choodani | ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని


ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
వింత సంగతి యేసు పుట్టుక
బెత్లహేము అయ్యింది వేదిక
తూర్పునుండి వచ్చింది తారక

ఎంత గొప్ప కానుక - చింతలింక లేవిక
అంతటా అందుకే పండుగ

1.పాపియైన మనిషిలో నుండి
నీతిరాజు ఎట్లు వచ్చునండి
పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని
కన్యమరియు జన్మనిచ్చెనండి

2.అల్పమైన నజరేతునుండి
మంచి ఫలము ఎట్లు వచ్చునండి
చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొని
మేలుకరముగా మార్చెనండి

3.నరునికై మహిమలో నుండి
మధ్యవర్తి ఎట్లు వచ్చునండి
రక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొని
ఇద్దరిపై చెయ్యిఉంచెనండి

12 July 2022

Emmanuyelu deva naatho | ఇమ్మానుయేలు దేవా నాతో

ఇమ్మానుయేలు దేవా - నాతో ఉన్నవాడా
నా కొండా కోట నీవే దేవా (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగా
దిగులిడను నేను - నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు||

1.నీ కౌగిలిలో నను దాచుకున్నావు -
నీ మాటలతో నాన్నదరించావు (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగా
దిగులిడను నేను - నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు||

2.నా కపరివై నను పోషించావు
కనుపాపలా నను కాచుకున్నావు (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగా
దిగులిడను నేను - నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు||

09 June 2022

Edugo gorrelakapari sodarulaara | ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా

163 
యేసు గొఱ్ఱెల మంచి కాపరి
రా - పంతువరాళీ, తా - చాపు

    ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా - యిడుగో గొఱ్ఱెలకాపరి = కడగానరాని - కారడవిలో నలసట - పడెడు గొఱ్ఱెలను - పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||

1.చెదిరిపోయిన గొఱ్ఱెనై - దొడ్డికిఁబోవ - ¹ముదములేని వాడనై = మృదుమధురంపు నీ - ²నాదమా లించక కర్త - ³కొదిఁగి యుండక మూఢ - హృదయుఁడనైతి ||నిడుగో||

2.దూరంబునకుఁబోతిని - జనకుని కృపా - సారంబుఁ ⁴గొననైతిని = ⁵కారు మూర్ఖపుపిల్ల - గా సంచరించినా - ⁶కూరిమి యిలుఁబాసి - దారి దొలగిపోతి ||నిడుగో||

3.తనదు గొఱ్ఱెను జూచెను - బోయఁడు తండ్రి - తనశిశువును గాంచెను = కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన ⁷గిరికటకాదు - లను వెంబడించిరి ||ఇడుగో||

4.ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించి యున్నప్పుడు = ⁸త్రాణార్థమగు ⁹నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగా దెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో||

5.చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను = కడిగి గాయములన్ని - గట్టి శుభ్రముచేసి - ¹⁰తడయక నాయింట - నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||

6.ప్రభుయేసు నా బోయఁడు-  యీతఁడె భూమి - ¹¹నభము లేలెడి ¹²రాయఁ డు = శుభమైన తనదివ్య - ¹³శోణిత మొసఁగియ - ¹⁴వ్విభుఁడు ప్రేమించి దీ - వించి స్వస్థముఁజేసె ||నిడుగో||

7.నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొఱ్ఱె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుఁ గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె ||నిడుగో||

8.నేను మూర్ఖపుగొఱ్ఱెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి - నానందముననుందు ||నిడుగో||

9.చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - ¹⁵నెడ్డెతనముఁ గొంటిని = ¹⁶మెడ్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం - తును ముక్తి ¹⁷నిలయంబు ||ఇడుగో||
                          – పురుషోత్తమ చౌదరి
 -------------------------------
¹సంతోషము. ²శబ్దము. ³లోబడి. ⁴పుచ్చుకొను. ⁵మోట. ⁶ప్రేమగల ఇల్లువిడిచి. ⁷పర్వతప్రక్కలు. ⁸బలమైన.  ⁹ప్రేమ. ¹⁰ఆలస్యముచేయక. ¹¹ఆకాశము. ¹²రాజా. ¹³రక్తము. ¹⁴ప్రభువు. ¹⁵మోటతనము. ¹⁶ఆటంకము. ¹⁷నివాసము.

23 April 2022

Idhigo naa shishuyulara | ఇదిగో నా శిష్యులారా యెఱుక

224  
క్రీస్తు కడపటి హెచ్చరిక
రా - ముఖారి,  తా - ఆది

ఇదిగో నా శిష్యులారా - యెఱుక లుంచుఁడి = మోక్ష -  ¹సదనమున కేను బోదు - సంతోషించు(డి ||ఇదిగో||

1.యెరూషలేమందుండి మీ - రెదురు చూడుఁడి -  మీపైఁ - బరిశుద్ధాత్మయు దిగివచ్చి - పనులు దెల్పును ||ఇదిగో||

2.దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మీతో - మక్కువైయుండఁ బరిశు - ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||

3.నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు = నాతో - సర్వకాలము నిత్య - సామ్రాజ్యము నేల ||నిదిగో||

4.ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుఁడి =  నాదు సకలాజ్ఞలందు నిదియె - సార మనుకొనుఁడి ||యిదిగో||

5.ఏదైననా పేరిటమీ - రించుక వేఁడినను = మీకు - మోదముతోడదాని - ముందే చేయుదును ||ఇదిగో||

6.ఉల్లము లందుఁ గలఁత - లెల్ల విడువుఁడి = నేను -  మళ్లి వచ్చెడి విధము - మరువకుండుఁడి ||యిదిగో||
                 – పురుషోత్తము చౌదరి

28 March 2022

Idi rakshana krupa kaalam | ఇది రక్షణ కృపకాలం

ఇది రక్షణ కృపకాలం - ప్రభు త్వరగా రా సమయం 
ఇక ఆలస్యం లేదిక - మనస్సు మార్చుకోనీవిక (2)

1.రాజ్యముల రాజ్యముల్ - జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్ - ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2.దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే - యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన - అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు||ఇది||

4.క్రైస్తవుడా మేలుకో - సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు - ఆత్మయందే బలపడు ||ఇది||

20 February 2022

Idhigo shubhada rakshanamu | ఇదిగో శుభద రక్షణము

160
క్రీస్తును గూర్చి ప్రవచనములు
రా - పంతురాళీ, తా - అట 
(ఛాయ: ఇడుగో గొఱ్ఱెల కాపరి)

ఇదిగో శుభద రక్షణము - దేవుఁడు పంపె - నిదిగో శుభద రక్షణము = ¹సదమలంబగు పూర్వ - సత్యవాక్యమునందు -  మృదువుగా దీర్ఘ ద - ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||  

1.²అలపిశాచముతోడను - దేవుఁడు తొల్లిఁ - బలుకు వాక్యము జాడను = ³పొలతి సంతతి నిన్ను - తలఁగొట్ట బుట్టునని - తెలియఁజేసెను మోషె - దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||  

2.ఘన దివ్య బలిచేయను - పాపములెల్లఁ - ⁴దునిమి పుణ్యము లియ్యను = ⁵ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని - మును దానియేలు బ - ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో|| 

3.యూద రాజ్యములోపట - బెత్లేమనెడి - యూరఁ గ్రీస్తుడు బుట్టుట = ఆదిలోన మీకా - యను దీర్ఘ దర్శిచే - మోదమునఁ దెల్పబడె - ముందు వేదమునందు ||ఇదిగో|| 

4.మన దోషముల కొఱకునై - యేసుని కాయ - మది గాయముల ⁶హ్రస్వమై = మన రక్షకుని పాట్లు - గనినట్టుల యెషయ్య - మును దెల్పె దీర్ఘద - ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||
 -  పురుషోత్తమ చౌదరి
------------------------------------------------
¹మిక్కిలి పరిశుద్ధమైనది. ²ఆ. ³స్త్రీ. ⁴నాశనము చేసి. ⁵చక్కగా. ⁶క్షీణించి.

15 February 2022

Edhigo vinuma o lokama | ఇదిగో వినుమా ఓ లోకమా

ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను

ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా 
మరనాత... ||ఇదిగో||

మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో ప్రభువు వేగమే దిగివచ్చును   
ప్రభునందు మృతులు లేతురు సమాధులు తెరువగ
విశ్వాసులంత దాల్తురు మహిమ రూపును వింతగ
ఎత్తబడును సంఘము అయ్యో విడువబడుట ఘోరము
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

ఏడేండ్లు భువిపై శ్రమకాలం - ప్రాణాలు జారే భయకాలం
ఊరలు తెగుళ్ళు దైవ ఉగ్రత పాత్రలు
ఆకాశ శక్తుల్‌ కదలును గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము రాజ్యమేలును వికృతి
సంఘమెంతొ హాయిరా మధ్యాకాశన విందురా
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

అన్యాయము చేయువాని చేయనిమ్ము
అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను పరిశుద్ధునిగుండనిమ్ము
ప్రతివాని క్రియల జీతము ప్రభు తెచ్చును ఒక దినం
రహాస్య క్రియలు అన్నియు బయలుపడునులే ఆ దినం
లోక ధనము కూడిరా నీకుంద పై సంపద ఆ...ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

ఓలీవకొండపై రారాజు అడుగుపెట్టెడి ఆరోజు
కొండయే చీలును భూగోళమే కంపించును
ప్రతి జనం ప్రభునే చూచును ప్రతి జాతియు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడ సాతానుకు దడదడ ఆ....ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

వెయ్యేండ్లు భూమిపై ప్రభు యేసు పాలించును పరిపాలించును
నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం
ఈ భూమ్మీద నీ కృత్యముల్‌ సమస్తం కాలిపోవును
మిక్కటమైన వేడితో పంచభూతముల్‌ లయమగును
క్రొత్త భూమి ఆకాశం ఇక శాశ్వత జీవితం
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

క్రీస్తేసులో విశ్వసించువారే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారే
దేవుని మహిమకు నిత్యజీవమునకు అర్హులు
జీవం మరణం రెండును నీ యెదుటనే యున్నవి
ప్రభు యేసే జీవ మార్గమని నీకు తెలుపబడియున్నది
విశ్వసించు ప్రియుడా కాదు ....

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా      

23 October 2021

ఇరుకులో విశాలత

🙏ప్రభువు నామములో శుభోదయం.🙏..
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *ఇరుకులో విశాలత* ✝️

"ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే" 
కీర్తనలు 4:1

ఈ నాలుగో కీర్తన ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి శ్రమలు మనకు ఎదురైనా వాటినన్నింటిలో నుండి నుండి దేవుడు మన పట్ల శ్రద్ధ చూపుతూ, మనకు అనేక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడని ఈ కీర్తన చెప్పబడింది. మొదట ఆయన విశాలత అను ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్నాడు. విశాలత అంటే ఉపశమనం విశాలతతో కూడిన శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తున్నాడు అంటే ఆయన ప్రజలను ఆయన విశాలపరుస్తున్నాడు. అంటే మనం వర్ధిల్లాలని ఆయన కోరుతున్నాడు. ఇందుకు యోసేపు మంచి ఉదాహరణ అతని శ్రమలు అతని స్వభావాన్ని వెల్లడించాయి. అతడు వర్ధిల్లాలి అనేక శ్రమలు విశాల జీవితానికి నడిపిస్తాయి. తద్వారా విశాల ప్రదేశాలకు, విశాల మార్గాలకు మనలను నడిపిస్తాయి. దేవుడు దావీదు పరిచర్య విశాల పరిచాడు అయితే అందుకొరకు ఆయన అతని మొదట వర్ధిల్లజేశాడు.

🛐 *ప్రార్ధన* 🛐
నా ప్రియ రక్షకా!నా జీవితంలో అనేక ఇబ్బందుల నుండి నన్ను విడిపించినందుకు స్తోత్రములు.ముందు ఎదురయ్యే పరిస్థితులలో నుండి ఆదుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి.ఆమెన్!

👉సూర్యుడు కొన్ని చెట్లు మరియు పువ్వులు కోసం ప్రకాశం ప్రకాశిస్తాడు అని అనుకుంటాం, కానీ విస్తృత ప్రపంచ ఆనందం కొరకు - హెన్రీ వార్డ్ బీచర్

20 August 2021

Idigo Neethi Bhaskarundu | ఇదిగో నీతి భాస్కరుండు

84          
నీతి సూర్యుఁడు
రా – బేహాగ్,  తా – ఏక
          
ఇదిగో నీతి భాస్కరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి = మది తమో గుణంబులణపై - సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

1.ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ - మెవని మనుజ రూపమాయె = నవవినీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి || ఇదిగో ||

2.నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో – దురితఋణము దీర్చునెవఁడో = పరమపురుషు డేసుఁడతఁడె - నిరతజీవ మొసగునిపుడె || ఇదిగో ||

3.కలుష మెల్ల బాపదలఁచి - కలువరి గిరివరకు నడచి - యలవికాని ముక్తి గూర్చన్ = సిలువమీద బలియై మరణ - బలమునణఁచి తిరిగిలేచె||ఇదిగో||

4.మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె - హృదయరసము లతిశయించి = సాధుగుణముగలిగి యేసు - పాదములను గొలుతు నిపుడె || ఇదిగో॥

5.జనగణముల జీవమతఁడె - ధనఘనముల దాతయతఁడె - యనుభవమున నెఱుఁగుమతని = యనుపమ ప్రేమా మృతంబు - ననవరతా నందకరము || ఇదిగో ||
                            – చెట్టి భానుమూర్తి

18 August 2021

Edi Yehova Kaliginchina Dinamu | ఇది యెహోవా కలిగించిన దినము

58
ప్రభు దినము
రా - యదుకుల కాంభోజి,  తా – ఆది
                     
ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబు నను - జొప్పడు గడియలు - కొదువలేని దయ - గుల్కెడు వానివి || యిది ||

1.మోక్షము భూమియు స - మ్మోద మంది నుతు = లక్షరు గద్దె చుట్టు - నాక్రమింతురు గాక || నిది ||

2.అతఁడీ దినమం - చంత మొందు నర = వితతి నుండి వే = వితతి నుండి వే - వేగ వచ్చెను || ఇది ||

3.ఆ పిశాచ రా - రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ - యము లీ దినమున || నిది ||

4.సేవక వరులు విల - సింపఁగఁ జేసి యా = పావనా ద్భుతములఁ - బ్రచురముఁ జేయుదు ||యిది||

5.దావీదుని వర - తనయుఁడై యభిషే = కావృతుఁడౌ రాజా - గ్రణికి హోసన్నా || యిది ||
                                 - పురుషోత్తమ చౌదరి

16 August 2021

Ennaallu maaku sayamai ఇన్నాళ్లు మాకు సాయమై యీ

35
O God our help in ages past

1.ఇన్నాళ్లు మాకు సాయమై- యీ ముందుకును మా
యున్నత గృహ మండవై - యొప్పెడు దైవమా!

2.ఏలాటి యీతిబాధయు - నీవచ్చు యేఁటిలో
కలుగకుండఁ బ్రోవవే - ఘనంపు ప్రేమతో

3.నీ సింహాసన నీడలో - నిలుచు భక్తులు 
భయంబు చింతబాధలన్ - జయించి మదురు

4.చరాచరంబు లెల్లను - జనించుకంటె మున్ 
దరతరాలనుండియున్ - నీరాజ్య ముండెడున్

5.ఇన్నాళ్లు మాకు సాయమై - యేలుచుఁ గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో - మన్నించు మింకను.
                                 - ఐజక్ వాట్స్
      అను : ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు సామర్

22 June 2021

Idi Devuni Vijayamu | ఇది దేవుని విజయము

ఇది దేవుని విజయము సాతనుని పతనము (2)
సిలువలో నెత్తుటి ధారలు - సాతానునికే చితి మంటలు - హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2) ||ఇది||

1. మోహపు చూపుల మనిషి మోముపై - ఉమ్మి వేసెను, ఉమ్మి వేసెను - 
మోసపు తలపుల మనిషి శిరస్సుపై ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం - 
పాపా తనువున కొరడా దెబ్బలు - శాప కరముల కఠిన శీలలు - 
అపవాదికే అంత్య క్రియలు ప్రభు యేసుకే విజయ గీతికలు ||ఇది||

1. లోక పాపమును శోక భారమును - సిలువ వేయుటే తండ్రి చిత్తము - 
పాప క్షమాపణ శాప విమోచన సాధించుటయే తనయుని త్యాగము - 
మానవాళికి మోక్ష మార్గము - మానవాత్మలకు రక్షణ భాగ్యం(2) - సిలువ సునాదం పునారుద్దానం - పరిశుద్ధాత్ముని ఘన సాక్ష్యం  ||ఇది||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...