Showing posts with label నా యెదుట నీవు తెరచిన తలుపులు. Show all posts
Showing posts with label నా యెదుట నీవు తెరచిన తలుపులు. Show all posts

05 March 2021

Naa Yeduta Neevu Terachina | నా యెదుట నీవు తెరచిన తలుపులు

నా యెదుట నీవు - తెరచిన తలుపులు 
వేయ లేరుగా - ఎవ్వరు వేయలేరుగా 
నీవు తెరచిన తలుపులు
                              ||నా యెదుట||
1. రాజుల రాజ - ప్రభువుల ప్రభువా 
    నీకు సాటి - ఎవ్వరు లేరయా 
    నీ సింహాసనం - నా హృదయాన 
    నీ కృపతోనే- స్థాపించు రాజా 
                              ||నా యెదుట||
2. కరుణామయుడా - కృపాసనముగా 
    కరుణా పీఠాన్ని - నీవు మార్చావు
    కృప పొందునట్లు - నాకు ధైర్యమిచ్చి 
    నీ సన్నిధికి - నన్ను చేర్చితివా
                              ||నా యెదుట||
3. ప్రధాన యాజకుడా - నా యేసురాజా
    నిత్య యాజకత్వము - చేయుచున్నవాడా
    యాజక రాజ్యమైన - నిత్య సీయోను 
    నూతన యెరూషలేం - కట్టుచున్నవాడా
                              ||నా యెదుట||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...