Showing posts with label Naa Jeevithana Kurisene Nee lyrics. Show all posts
Showing posts with label Naa Jeevithana Kurisene Nee lyrics. Show all posts

29 March 2021

Naa Jeevithana Kurisene Nee | నా జీవితాన కురిసెనే నీ కృపామృతం

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం -
నా జిహ్వకు మధురాతి మధురం -
నీ నామ గానామృతం (2)
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను (2)

1. నీ దయ నుండి దూరము కాగా
    ప్రేమతో పిలిచి పలుకరించితివే (2)
   కృపయే నాకు ప్రాకారముగల -ఆశ్రయపురమాయెను
    నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను
                                     ||నా జీవితాన||
2. నా యేసయ్యా - నీ నామమెంతో -
    ఘనమైనది - కొనియాడదగినది (2)
    కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
    నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది
                                     ||నా జీవితాన||
3. నీ సన్నిధిని నివసించు నాకు -
    ఏ అపాయము దరిచేరనివ్వవు (2)
    కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను-
    నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను(2)
                                     ||నా జీవితాన||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...