Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

01 June 2026

వినరే నరులారా మనముల Vinare narulaara manamula

271
ప్రభుని బాప్తిస్మము
రా - ముఖారి, తా - ఆది 

వినరే నరులారా - మనముల - వేడుకలను మీర = మన, రక్షకుఁడగు - మరియా తనయుని - మహిమలు చెవులార ||వినరే||

1.తన కన్నను ముందు - యోహా - నను నతఁ డింపొందు = ఘనతర మగును - ప్రవచనముఁబ - ల్కెను భూజను లందు - ||వినరే||

2.అతఁడు యోర్దాను - నదిలో - ఖ్యాతిగ ననుదినమున్ = పాతకులకు బా - ప్తిస్మ మిచ్చు నెడం - ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||

3.న్యాయము నిలుపుటకై - ప్రభుని వి - ధేయతఁ గనుపఱచి = శ్రేయ పతి బొం - దెను యోహానుని - చేత బాప్తిస్మంబు ||వినరే||

4.పరమండల మపుడు - తెరవం - బడి పావురము గతిన్ = పరిశుద్ధాత్మ శు - భప్రభ లీనుచుఁ - ప్రభువు మీఁద వ్రాలెన్ ||వినరే||

5.ఆకాశమునుండి - కలిగెను - ప్రాకటమగు రవము = నా కితఁడు ప్రియం - బౌ కుమారుఁడా - నంద మొంది రనుచు ||వినరే||

6.అంతట మన కర్త - పరిశుద్ధాత్మ బలము కలిమిన్ = సంతసమున మో - క్ష కుశలవార్తను - జాటంగను దొడఁగెన్ ||వినరే||

7.ఆ నిత్య సువార్త - మన మెద - లో నిడి నమ్మినచో = నానందమయం బమృత మేసు ద-యా నిధి మన కొసంగున్ ||వినరే||
- పురుషోత్తము చౌదరి 

30 May 2026

వినరే యపోస్తలుల కార్యముల్ Vinare yaposthula karyamul

 251
పరిశుద్ధాత్మ కుమ్మరింపు 
(ఛాయ: రారే గొల్లవారలార)
రా - ఆనంద భైరవి,     తా - ఆది 

వినరే యపోస్తలుల కార్యముల్ - క్రైస్తవు - లను వారి కవి యెంతో ధైర్యముల్ = మనసు లొక్కటిఁ జేసి - కొని యట్లు ప్రార్థింప - ఘన ముగ విమలాత్మ = చనుదెంచె వారిపై ||వినరే||

1.పరమండలమునుండి వచ్చెను - పెద్ద - కరువలివలె శబ్ద మిచ్చెను = తిర ముగ వార లం- దరుఁ గూడి యున్న మం- దిర మెల్ల నిండె బం- ధురమై తన్నాదము ||వినరే||

2.అనలార్చులను దీప్తి మించుచు-బీఁట-లగు జిహ్వల్వలె గనుపించుచు = ఘనముగ నొక్కొక్క - జనునిపై - నవి నిల్వఁ - గను బరిశుద్ధాత్మచే - తను నింపఁబడి రంత ||వినరే||

3.వారన్య భాషలతోడను - నాత్మ - ప్రేరణమును జేయు జాడను = ధారా ళముగ భాషాం-తరము లాడిరి విన్న-వారి కబ్బురమై వి - చారము ల్బొడమంగ ||వినరే||

4.ముందట వారిటుల గుంపుగ - మోద- మందుచు దేవునిఁ గొల్చి తా = మందరు చూడఁగ - వింత వింత పనుల - నందందు జేసిరి - దేవుని దయచేత ||వినరే||

5.మనము నా రీతిగ గుంపుగాఁ గూడి - మన దేవుఁ గొల్వఁగ భూమిలో = మనుజుల కాశ్చర్య - మగు కార్యములఁ జేయ - నొనగూడు మనసు కా-నందమును గల్గు ||వినరే||
- పురుషోత్తము చౌదరి 

26 April 2026

వందిత శుభగుణశాలీ Vandita shubhaguna shaali


వందిత శుభగుణశాలీ మానవ - మోచక! దయాంబురాశీ! (2) 
అగణిత దూత ప్రణుతా! పతితావన! 
అగణిత దూత ప్రణుతా! పతితావన! 
వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ! (2)

1. ఆది పాప శాపంబుగ ధరపై - ముళ్ళనొసగి మాక్రూర కరములకు (2)
నినుహింసించెడి మార్గము చూపితే - మా కొరకే యా శిక్ష భరించితే
నాదు యేసువా! నాటి యెహోవా....!
భళిరే! దౌర్భాగ్య నరులపై - నీదు కృపా బాహుళ్యమింతయా!
అగణిత దూత ప్రణుతా! పతితావన! (2) ||వందిత||

2. నాకపు ఘన మందిరపు నివాసము - కన్నపతిత ప్రక్షాళిత మానవ (2)
హృదియే ఘనమని.. మము దయ గంటివే - మము నీ మహిమాలయముగ జేసితే 
నాదు యేసువా! నాటి యెహోవా! భళిరే! 
నిర్భాగ్యనరులపై నీ కరుణా దాతృత్వమింతయా..! 
అగణిత దూత ప్రణుతా! పతితావన! (2) ||వందిత||

28 April 2024

Vishwasamutho vededi variki విశ్వాసముతో వేఁడెడి వారికి

388
విశ్వాస ప్రార్థన 
(ఛాయ: మనసానందము) 
రా - సౌరాష్ట్ర, తా - ఆది 

విశ్వాసముతో - వేఁడెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును = శాశ్వత రాజ్య - థీశ్వరుఁ డాఢ్యుఁడు - శాశ్వత మగు నీ - శాసన మె చ్చెను ||విశ్వా||

1.బిడ్డలు తండ్రుల - వేడఁగ నన్నము - బెడ్డ లిచ్చు వె - ఱ్ఱులు గలరే = దొడ్డ తండ్రి నిలఁ - దోడ్పా టడిగిన - నడ్డులేక విమ - లాత్మ నొసంగును ||విశ్వా||

2.నమ్మకమునఁ జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో = ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||

3.వెతకెడు వారికి - వెసఁ గృపఁ జూపును - గతిఁ గని వేడం - గాఁ దెర చున్ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేఁడగ - నెంత యు మేలగు ||విశ్వా||

4.బల మేమియుఁ గనఁ - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు = నలయకు నేలను - నావగింజ మరి నిలిపినఁ జెట్టయి - నింగికి నెదుగదె ||విశ్వా||

5.అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా = భువిఁ బాపాత్ములఁ - బ్రోచెడు ప్రభు కృపఁ - జవిఁ జూడుము నుతి - సల్పుచు వేగమే ||విశ్వా||
- ఎ. జెకర్యా 

28 January 2024

Vaadukaga vakyamunu వాడుకగా వాక్యమును

వాడుకగా వాక్యమును చదివితిమి గాని 
వాస్తవముగా దాని భావమే మరిచితిమి

ఆచారముగా ఆలయమేగితిమి గాని
ఆచరణలో ఆజ్ఞలను విడిచితిమి

తుదకు వాక్యము నీవని యెరిగితిమి
నీ ఆలయముగా మేము మారితిమి
తప్పులను తెలుసుకొని - తలవంచి నిలిచితిమి

దేవా దయతో మమ్ములను మన్నించితివి
అక్కున చేర్చుకొని ఆదరించితివి
ఎల్లలు లేని నీ ప్రేమను - మా పై కురిపించితివి

అందుకే...యేసూ
అంజలి ఘటియించినాము

అందరి మనసులలోని చీకటుల
హారీయించి తరియింప చేయగా
నీ సుందర పదములు ముందర
మేమందరం
యేసూ అంజలి ఘటియించినాము

అంజలి ఘటియించడం అంటే అర్థం
శ్రద్ధతో, భయభక్తి తో
దేవున్ని ఆరాధించడం
లేదా దేవున్ని వేడుకోవడం అని అర్థం

19 November 2023

Vadipokamunde nannu vaduko వాడిపోకముందే నన్ను వాడుకో


వాడుకో… యేసయ్యా….
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా (2)

వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)
వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక||

1.నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో||

2.నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే -
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో||

3.నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే -
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో||

4.నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే -
నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||

24 September 2023

Viswasa vanithalam yehova |l విశ్వాస వనితలం యెహోవా

విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం
శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య

దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం

11 May 2023

Vedhanalo odarpu neeve వేదనలో ఓదార్పు నీవే

వేదనలో ఓదార్పు నీవే నీవే (2)
నను చుట్టుముట్టిన శ్రమ వలయములో (2)
నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా (2)
వేదనలో ఓదార్పు నీవే నీవే (2)

1.నేనుగా భరించలేని శోధనలు - నాపైన మోపలేదు ఏనాడూ (2)
నా స్థితినెరిగిన దేవుడ నీవు - ఏ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు (2)
చల్లని చూపు నిలిపినావు ||వేదనలో||

2.నాకు క్షమకు యోగ్యతయే లేనప్పుడు - నీ అక్షయ రుధిరమిచ్చి కొన్నావు (2)
నా స్థితి మార్చిన దేవుడ నీవు - ఏ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు (2)
చల్లని చూపు నిలిపినావు

వేదనలో ఓదార్పు నీవే నీవే (2)
నను చుట్టుముట్టిన శ్రమ వలయములో (2)
నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా (2)
ఆ విజయముకై నీకు స్తోత్రము, నిజ దేవుడ నీకే స్తుతి స్తోత్రము (2)

08 May 2023

Vandanamayya vandanamayya | వందనమయ్యా వందనమయ్యా

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం

అద్వితీయ సత్య దేవా వందనం - వందనం
పరమ తండ్రి పావనుండా వందనం - వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం - వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం - వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

వ్యోమ సింహాసనుండ వందనం - వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం - వందనం (2)
ఆద్యంత రహిత నీకే వందనం - వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం - వందనం (2) ||హల్లెలూయా||

ప్రాణదాత యేసునాథా వందనం - వందనం
ముక్తిదాత జీవదాతా వందనం - వందనం (2)
సిల్వధారి ప్రేమమూర్తి వందనం - వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం - వందనం (2) ||హల్లెలూయా||

13 November 2022

Viswasa vanithalam yehova | విశ్వాస వనితలం యెహోవా

విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం - ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం – విజయ కీర్తన పాడెదం

1.జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం

2.శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య

3.దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం

19 October 2022

Viduvaledennadu neevu na cheyi | విడువలేదెన్నడూ నీవు నా చేయి

విడువలేదెన్నడూ నీవు నా చేయి 
మరువలేదెన్నడూ నన్ను నీ కృప (2)
యేసయ్యా ... రక్షణ ప్రాకారమా ... 
యేసయ్యా ... నాకున్న ఆధారమా (2) 

నా గుడారముపై నీ దృష్టిని నిలిపి 
ప్రతి శాపమును తొలగించినావు 
పరలోక సంపదలు సమృద్ధిగా నింపి 
ఆశీర్వదించి హెచ్చించినావు (2)
నీ సరిహద్దులను నే దాటిపోకుండా - నీ పాదసన్నిధిలో నను నిలిపినావు (2) ||విడువ|| 

నీవుండు స్థలములో నేనుండాలని 
పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో 
మలిన వస్త్రములు తీసివేసి 
రక్షణ వస్త్రములు తొడిగించినావు (2)
అర్హత లేకున్నా నీ సేవ కొరకు - యాజక వస్త్రములు ధరింపచేసితివి (2) ||విడువ||  

ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద 
దాచియుంచితివి ఈనాటి వరకు 
నీ మందిరములో పూర్ణ హృదయముతో
ఆరాధించుటకు ఆత్మతో నింపితివి (2)
నీకు విరోధముగా రూపించే - ఏ ఆయుధము వర్ధిల్లదంటివే (2) ||విడువ||

29 August 2022

Vachunu kreesthu vachunu| వచ్చును క్రీస్తు వచ్చును

233
క్రీస్తుని రెండవ రాకడ 
రా - పంతువరాళ్లి, తా - చాపు 
(చాయ: వందనం నీకె)

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును = చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

1.అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె సజీవులై ప్రభు - చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||

2.ఒనరగనుఁదన మేఘ సింహా - సనముపైఁ గూర్చుండి పావన - జనుల బారుల నిరుపార్శ్వము - లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||

3.అదను నిది యని హృదయములు ప్రభు - పదయుగళ సున్నతియెఱుంగక - మద దు రేచ్ఛల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||

4.అమిత పాపాత్ముల నరకలో - కమునఁ బడవైచి సుజన సమూ - హముల దనవెను వెంటఁ గొని చను - విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||

5.తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై -  తల్లడిల్లుచు నొకరి నొక్కరు - నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||
– రావూరి లక్ష్మయ్య 

12 July 2022

Vedana tholaginchu vaadu yese| వేదన తొలగించు వాడు యేసే

వేదన తొలగించు వాడు యేసే, నా కన్నీటిని తుడిచివేయును
కృంగిన హృదయపు లోతులలో,ఆనందము నింపు నాయనే
శోదనలో జయమిచ్చు వాడు యేసే, నా పక్షముగా పోరాడును,
ప్రతికూల సమయములెదురైనా, ప్రతి క్షణమున తోడు ఆయనే

యేసే నాకు ఆధారము, యేసే నాకు ఆదరణ
లోకమంతా నన్ను విడచినా ఓటమి భయము నాకు
చూపిన, యేసు నన్ను విడువడు

లేరెవ్వరు లోకములో నన్నింతగా ప్రేమించేవారు
తల్లి దండ్రులు నన్ను విడచిన, బంధు మిత్రులు
నన్ను కాదనిన నరుల్లెలరు నన్ను మరచినా,
ఆశ్రయమిచ్చు వారే లేకున్నా

(యేసు ఎన్నడు మరువడు, నా చేయిని విడువడు (2)
గాడాంధకారములో విహరించు చుంటిని, ముందున్న లోయలు కానక,
వేగముగా సాగు చుంటిని ఆ లోయల అంచుకు చేరగా,
యేసు నీవే నా ముందర నిలిచి నా పయనము గమనము మార్చి,
నా ప్రాణము నిలిపితివి

లేరెవ్వరు లోకములో నన్నింతగా ప్రేమించేవారు
సముద్రములు అడుగంటినా, పర్వతములు నేల రాలినాను నక్షత్రములు గతి తప్పిన,
భూమి పునాదులు వణికినాను
(నే యేసును విడువను, తన ప్రేమను మరువను (2)

12 June 2022

Vandanam triyekuda ghana | వందనం త్రియేకుడా ఘన

వందనం త్రియేకుడా - ఘన మహిమ నీకెగా (2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం||

1.ఈవులె-న్నెన్నో దయచేసితివి - నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (2)
నీ పాద సేవ చేయుటకన్నా - విలువైన భాగ్యం లేదు (2) నాకూ ||వందనం||

2.అవసరతలు ఏవైన తీర్చెడి - యెహోవా యిరే నీవే (2)
నా కోరికంతా ఏ క్షణ మైనా - నీవేగా నా యేసూ (2) ఆమెన్ ||వందనం||

3.మా సర్వమంతా నీవే నయ్యా - నీకే గా అంకితం చేసితిమీ (2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా - నీ ఆజ్ఞ పాటించెదమూ (2) స్తోత్రం ||వందనం||

08 June 2022

Vinthagala maa yesu premanu | వింతగల మా యేసు ప్రేమను

161
యేసు ప్రేమను స్తుతించుట
రా - బిలాహరి, తా - ఆట

   వింతగల మా యేసు ప్రేమను - సంతసమున స్తుతింతును = పంతముగఁ దన ప్రాణమును పా - పులకు నియ్యను వచ్చి సిలువను - జచ్చి నను రక్షించె నహహా ||వింత||

1.ప్రీతిగల మా ప్రభుని కృప బహు - ప్రియముతోఁ జాటింతును = సాధుగా నాకొఱకు సిలువను - చాల శ్రమల భరించి చావు జ - యించి నను రక్షించె నహహా ||వింత||

2.పాడుఁడీ మా యేసు ప్రేమను - వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ = పాడుఁడీ తన దివ్యరక్తము - పాప క్రయముగ నిచ్చి శాపముఁ - బాపి నను రక్షించె నహహా ||వింత||

3.నిత్య జీవము నిండు నెమ్మది - నిరతముగ నాకియ్యను = రక్తస్వేదము గార్చె నహహా - నరక శాపముఁ ద్రుంచి యాపద - నుంచి నను రక్షించె నహహా ||వింత||
                             – తూపిలి బెంజిమిన్

20 May 2022

Vinarayya narulaara | వినరయ్య నరులారా

155 
క్రీస్తు వాక్యము పతిత పావనము
(ఛాయ: మన మొదట తల్లిదండ్రుల్)
రా – శంకరాభరణము,  తా – త్రిపుట

   వినరయ్య నరులారా - విశ్వాసమున క్రీస్తు - విమల బోధ = పాప మనుజుల కెల్ల పా - వన జీవనము సేయు - వసుధ మీఁద ||వినరయ్య||

1.పాపాత్ములను పశ్చా - త్తాపము పడుఁడంచు - బ్రభువు దెల్పెన్ = దన దాపు గోరినవారిఁ - గాపాడుటకుఁ దానే ¹దక్షుడయ్యెన్ ||వినరయ్య||

2.భారాక్రాంతులైన - పాపులఁ - దనుఁ జేరఁ - బ్రభువు పిల్చెన్ = శ్రమలు - దూరంబుఁ జేసిత - ద్దురితముల్ బాపి సం - తోష మియ్యన్ ||వినరయ్య||

3.అనుమానింపక నెవ్వ - రైన వచ్చినఁ ద్రోయ - ననుచుఁ బల్కెన్ = పెక్కు - మనుజుల కొఱకు జీ - వన మియ్యనే వచ్చి - తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య||

4.మనసారదేవునిన్ - మానక ప్రేమింపు - మనుచునేర్పెన్ = ఇంకఁ దన పోల్కె - నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య||

5.తన శిష్యులకు నైక్య - మును బ్రేమించుట కాజ్ఞ - లొనర నిచ్చె = నెంతో ఘన - సత్ప్రభువు కాళ్లు - గడిగి భక్తులచోట - వినతుఁ డయ్యెన్ ||వినరయ్య||
                        – పురుషోత్తము చౌదరి
--------------------------------------------
¹సమర్దు. 

13 May 2022

Vinare manujulara kreesthu | వినరె మనుజులార క్రీస్తుఁ

150 
లాజరును తిరిగి బ్రతికించుట
రా - శంకరాభరణం, తా - ఆది

    వినరె మనుజులార క్రీస్తుఁ - ¹డిలనుఁ జేయు ఘనములైన =  పనులలోనఁ జిత్రమొక్క - పని ²వచించెద ||వినరె||

1.మన మనంబు ³లలరుచుండ - దినదినంబు ప్రభుని నిండు =  ఘన మహాద్భుతములు వినినఁ - ⁴దనివిఁ దీరదు ||వినరె||

2.ఇలను బేతనియపురంబు - గలదు మరియ మార్తలక్క = సెలియలందు వాసముండి - ⁵రెలమితోడను ||వినరె||

3.పరిమళంపు తైలమేసు - చరణములకుఁ బూసిన యీ = మరియ సోదరుండు రోగ - భరితుఁడయ్యెను ||వినరె||

4.వ్యాధిచేత లాజరుండు - బాధనొందుచుండఁ గ్రీస్తు = నాధుఁ బిలువనంపి రపుడు - ⁶నాతు లిరువురు ||వినరె||

5.తమ్ము డక్క సెలియలును బ్రి - యమ్ము తనకుఁ గలిగియుండ = నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ - ⁷డరిగె నచటికి ||వినరె||

6.యేసువచ్చు టెఱిగి మార్త - యెదురు గానుఁ బోయి తనదు = దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు - తోడ బల్కెను ||వినరె||

7.కర్త నీకు దేవుఁడిచ్చు - ఘనబలమెఱుగుదును సత్య = వర్తి విచట ⁸లేని కతన - ⁹వ్రాలె లాజరు ||వినరె||

8.పిదప మరియవచ్చి క్రీస్తు - ¹⁰పదయుగమున ¹¹కొరిగి యేడ్చి = మొదట మార్త పలికినట్లు - ¹²సుదతి పలికెను ||వినరె||

9.అపుడు కర్త వారిపలుకు - లాలకించి మదిని మూల్గి = కృపకుఁ బాత్రు రాలితోడ - నపుడు నడిచెను ||వినరె||

10.నడిచి లాజరుని సమాధి - కడకుఁ జేరి గుహను మూయఁ = బడిన రాయి తీయుఁడనుచుఁ - ప్రభువు చెప్పెను ||వినరె||

11.యేసుతోడ మార్తపలికె - నీ సమాధినునిచి నాల్గు = ¹³వాసరంబులయ్యెఁ గంపు - పట్టి యుండదా ||వినరె||

12.దాని నమ్మి చూడుమని మ - హానుభావుఁ ¹⁴డాత్మబలము = ¹⁵నూని తండ్రికిపుడు స్తోత్ర - మొనరఁజేసెను ||వినరె||

13.లాజరు సమాధినెడలి - రమ్ము లెమ్మటంచు ¹⁶లోక = పూజితుఁడు మహా ¹⁷రవంబుఁ - ¹⁸బూని పల్కెను ||వినరె||

14.మరణమైనవాఁడు ప్రాణ - భరితుఁడగుచు లేచి వచ్చెఁ = ¹⁹తరుణులధిక ²⁰హర్షలైరి - ²¹పెదజనంబుతో ||వినరె||

15.కన వినంగ రాని యిట్టి - ఘన మహాద్భుతంబుఁ జూచి = జనులు క్రీస్తు యేసునాధు - ననుసరించిరి ||వినరె||

16.కనుక మనము వానిఁ జేరు - కొని సుఖంబుఁ బడయవచ్చు = మనసు నిలిపి యతనియందు - ²²మనుట మేలగున్ ||వినరె||
                    – పురుషోత్తమ చౌదరి
----------------------------------------
¹భూమిలో. ²చెప్పెద. ³ప్రకాశించుచుండు. ⁴తృప్తి. ⁵సంతోషము. ⁶స్త్రీలు. ⁷పోయె. ⁸లేనందున. ⁹మరణమొందెను. ¹⁰రెండు పాదములకు. ¹¹మ్రొక్కి. ¹²స్త్రీ. ¹³దినములు. ¹⁴స్వకీయమైనబలము. ¹⁵ధ్వని. ¹⁶వహించి. ¹⁷లోకముచేత పూజింపబడదగినవాఁడు. ¹⁸వహించి. ¹⁹స్త్రీలు. ²⁰సంతోషించిరి. ²¹ఇతర. ²²బ్రతుకుట.

02 May 2022

Varanaamame sharanamu sharanamu | వరనామమే శరణము శరణము

141
క్రీస్తు నామమే మన శరణము
రా - శ్రీ రాగము,  తా - ఆట

వరనామమే - శరణము శరణము - క్రీస్తు - వరనామమే - శరణము శరణం ||వర||

1.పరమభక్త వ్రాత - దురిత సంఘాత దు = స్తర వన జాత భీ - కరకీలి యౌ క్రీస్తు ||వర||

2.సారహీన సం - సార పారావార = తారణ కారణ - తరణి యైన క్రీస్తు ||వర||

3.యూద దేశమునందు - నుండు బేత్లేహేమున = యూదు లను జనులలో - పాదుకొన్న క్రీస్తు ||వర||

4.ఇలలో పాపపు మాన - వుల నెల్ల మోక్ష సం = కలితులఁ జేయుఁగ - సిలువ నొందిన క్రీస్తు ||వర||

5.ఏచియున్నట్టి పి - శాచభారపు కాడి = మోసి దుఃఖించెడు - నీచులకును క్రీస్తు ||వర||

6.కొల్లగాను బాప - మెల్లఁ జేసి దాని = కుల్లములోఁదల్ల - డిల్లువారికిఁ క్రీస్తు ||వర||
                    – విలియం డాసన్
_______________________
¹శ్రేష్ఠమైన. ²రక్షకము. ³సమూహము యొక్క. ⁴సమూహమనెడు. ⁵దాటశక్యముగాని అడవుల సమూహమునకు. ⁶భయంకరమైన అగ్ని. ⁷సముద్రము. ⁸దాఁటుటకు. ⁹ఓడ. ¹⁰కూడుకొన్నవారిని. ¹¹బాధపెట్టి.

29 April 2022

Vekuva chukkala shreshtamou | వేకువచుక్కల శ్రేష్ఠమౌ

134 
Brightest and Best of the Sons

1.వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! 
మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము 
ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా 
మా బాలరక్షకు జూపింపుమా

2.చల్లమంచాయన తొట్టిపై నొప్పు 
పశులతో భువిబరుండెను 
కున్నెడు నాయన దూతల మ్రొక్కు 
నందర స్రష్ట, రాజు, రక్షణ

3.ఆయనకు మంచికాన్కలిత్తమా! 
ఏదోం సువాసనల ద్రివసుల్ 
వార్ది ముత్యాల్ కానబోళంబుఖని 
స్వర్ణము నిత్తమా యాయనకు

4.నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు 
కాన్కల నాయన ప్రేమరాదు 
అన్నిట డెందము బీదల మొరల్ 
దేవుని కిష్టము లౌకాన్కలు

5.వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా 
మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము 
ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా 
మా బాలరక్షకు జూపింపుమా
                   – రెజినాల్డ్ హెబర్

21 April 2022

Vijayambu vijayambu | విజయంబు విజయంబు

216  
ప్రభు పునరుత్థానము
రా - అసావేరి,  తా - త్రిపుట

విజయంబు విజయంబు - విజయంబు మా యేసు -  నిజమె మృత్యువు గెల్చి - నేఁడు వేంచేసె =  యజమానుఁ డెల్ల ప్ర - యాసము లెడఁబాప - స్వజనుల రక్షింప - సమసె సిలువమీఁద ||విజయంబు||

1.విజయంబు విజయంబు- విజయంబు మానవుల - ¹వృజిన నివృత్తిని - విభుఁ డొనరింపన్ = గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది - ²విజిత మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ||విజయంబు||

2.విజయంబు విజయంబు - విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ - బరిపాలనంబు =  ³కుజము మీఁదను బ్రాణ - త్యజనము జేసెను - ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ||విజయంబు||

3.విజయంబు విజయంబు - విజయం బిఁకను మా క - పజయము కాకుండఁ - బ్రభు యేసు క్రీస్తు =  సుజనత్వమున వైరి - ⁴వ్రజము గెల్వఁగఁజేసి -  నిజముగఁ బరలోక - నిలయంబులో నిల్పు ||విజయంబు||

4.విజయంబు విజయంబు - విజయం బనెడి పాట -  నిజ భక్తితో మనము - నేర్చిన వాని = భజియించుదము భూన - భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ - డమరత్వ మిడు మనకు ||విజయంబు||
                   – జాన్ ఫ్రాన్సిస్ స్పెన్సర్
__________________________
¹పాపము. ²జయింపబడిన. ³చెట్టు. ⁴సమూహము.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...