Showing posts with label Kaalam Neetho Aagadu. Show all posts
Showing posts with label Kaalam Neetho Aagadu. Show all posts

11 November 2021

Kaalam Neetho Aagadu | కాలం నీతో ఆగదు సమయం


కాలం నీతో ఆగదు సమయం నీతో ఉండదు 
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది 
దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది 
సోమరి ఎందాక ఉరుకుందువు 
కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా 
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు

1. కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
అజ్ఞానులుగా చరిత్రహీనులయారు 
దినములను దేవునికివ్వనివారు ఎందరో సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు 
దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
సమయమును వృధాగా గడపక, సద్వినియోగించాలి
అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
కాలమునెరిగి నిద్ర మేలుకొని 
సమయం అయినది అని తెలుసుకోవాలి ||సోమరి||

2. సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు 
ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు 
తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి
అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి సమయమనక అసమయమనక 
ప్రభు పనిలో ప్రయాసపడిరి
అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొనిరి ||సోమరి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...