Showing posts with label Yesu nannu preminchinaavu lyrics. Show all posts
Showing posts with label Yesu nannu preminchinaavu lyrics. Show all posts

11 July 2020

Yesu nannu preminchinaavu | యేసూ నన్ను ప్రేమించినావు

171
యేసుని గొప్ప ప్రేమ
రా - ముఖారి, తా - త్రిపుట

యేసూ నన్ను ప్రేమించినావు - పాపి నైన - నన్ను ప్రేమించినావు  

1.నన్ను ప్రేమింప మా- నవరూప మెత్తి దా - నముగా జీవము సిల్వపై - నిచ్చి = కన్న తలిదండ్రుల - యన్నదముల ప్రేమ - కన్న మించిన ప్రేమతో ||యేసూ||

2.తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే - దురితుండనై యుంటిని - నా = వల్ల జేయబడెడు - నెల్ల కార్యము నెప్పు - డేహ్యంబులై యుండగ ||యేసూ||

3.మంచి నాలో పుట్ట - దంచు నీ వెరిగి నన్ - మించ బ్రేమించి నావు - ఆహా = యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ - నెంచి ప్రేమించినావు ||యేసూ||

4.నన్ను ప్రేమింప నీ - కున్న కష్టము లన్ని - మున్నె తెలిసియుంటివి - తెలిసి = నన్ను ప్రేమింప నీ - కున్న కారణ మేమో - యన్నా తెలియదు చిత్రము||యేసూ||

5.నా వంటి నరు డొకడు - నన్ను ప్రేమించిన - నావలన ఫలము గోరు - ఆహా = నీ వంటి పుణ్యునికి - నా వంటి పాపితో - కేవలం బేమి లేక ||యేసూ||
- బేతాళ  జాన్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...