Showing posts with label Jayaprabhur Yesune Vembadinchuchu. Show all posts
Showing posts with label Jayaprabhur Yesune Vembadinchuchu. Show all posts

02 January 2022

Jayaprabhu Yesune Vembadinchuchu | జయప్రభు యేసునె వెంబడించుచు

462
యేసును వెంబడించుము
రా – శకరాభరణం,  తా – ఆది

జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||

1.ఆదరణయు అధికబలమును - ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూపగ ||జయప్రభు||

2.ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో ||జయప్రభు||

3.మా ప్రభు జూముము నీదు మార్గపు - మాదిరి జాడలను - నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును యీ కృపాదినమున ||జయ ప్రభు||

4.మా కొరకై నీవు నడచిన - మార్గము జూడగను - మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు ||జయప్రభు||

5.ఇహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము? - ఎవరిని ప్రేమింప వశమె? - విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని గొలువగ ||జయప్రభు||
ఎ. చార్లెస్ కిన్సింగర్


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...