Showing posts with label SP Balu songs lyrics. Show all posts
Showing posts with label SP Balu songs lyrics. Show all posts

21 March 2021

Deva Nee Sakshiga | దేవా నీ సాక్షిగా నేనుండుంట


దేవా నీ సాక్షిగా నేనుండుంట- ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై , కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు, నా తుది శ్వాస ఆగేవరకూ ||దేవా నీ సాక్షిగా||

1.నాలాంటి నరమాత్రుని చేరుట - నీవంటి పరిశుద్ధునికేలనో (2) 
ఏ మేధావికి విదితమే కాదిది - కేవలం నీ కృపే దీనికాధారము 
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే - నా బ్రతుకంతా కొనియాడుట ||దేవా నీ సాక్షిగా||

2. నా ఊహకందని మేలుతో - నాా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా - నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము- నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా నీ సాక్షిగా||

17 February 2021

Yehova maha deva sahayamu | యెహోవా మహా దేవ సహాయము

యెహోవా మహా దేవ - సహాయము కావయ్య 
నిన్ను నమ్మిన దీనులను - దయతో దరిచేర్చుము దేవా ||యెహోవా||  

1.మనిషే మనిషిని మరచి - మనసు మనసును కలచి (2)
జగమే తమదని తలచే - జనులుండే ఈ భువిలో ||యెహోవా||  

2.బ్రతుకే తీరని తిమిరం - బ్రతకాలని ఈ సమరం (2)
బ్రతికేందుకు మేమెవరం - బ్రతికించుట నీకు ప్రియం ||యెహోవా||  

3.కలిమిలేములు కలసి - సుఖము దుఃఖము తెలిసి (2)
పగలూ రేయి తపించే - బలహీనుల బ్రోవుమయ ||యెహోవా|| 

05 February 2021

Ye Yogyatha Leni Nannu| ఏ యోగ్యతా లేని నన్ను నీవు

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును (2)

1. కలిషుతుడైన పాపాత్ముడను -
    నిష్కళంకముగా నను మార్చుటకు(2)
    పావన దేహంలో గాయాలు పొంది(2)
    రక్తమంత చిందించినావా
                                            ||నీకేమి||
2. సుందరమైన నీ రూపమును -
    మంటివాడనైన నా కియ్యుటకు(2)
    వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి(2)
    నీ సొగసును కోల్పోయినావా
                                          ||నీకేమి||
3. పాపము వలన మృతినొందిన -
    అపరాధినైన నను లేపుటకు (2)
    నా స్థానమందు నా శిక్ష భరించి(2)
    మరణించి తిరిగి లేచినావా
                                         ||నీకేమి||
DOWNLOAD MP3 SONG HERE 👇

13 August 2020

Yehova na kapari yesayya na | యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి

యెహోవా నా కాపరి - యేసయ్య నా ఊపిరి 
నాకు లేమిలేదు
లోయలలో లోతులలో - యెహోవా నా కాపరి 
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి 

1.పచ్చికగల చోట్ల - నన్ను పరుండ జేయును
శాంతికరమైన జలములకు - నన్ను నడిపించును
                                            ||లోయలలో||
2.నా శతృవు యెదుట నాకు - భోజనమిచ్చెదవు
నూనెతో నా తల అంటెను -నా గిన్నె నిండి పొర్లెను
                                             ||లోయలలో||
3.నీవు తోడై యుందువు - నన్ను ఆదరింతువు
నీ మందిరములో కలకాలం - నివాసము చేసెదను 
                                            ||లోయలలో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Maa Inti Peru Pasuvula Paka | మా ఇంటి పేరు పశువుల పాక

మాఇంటి పేరు పశువుల పాక 
పక్కింటి పేరు ఒలీవల తోట (2) 
ఎదురింటి పేరు కల్వరి కొండ 
మా వాడ పేరు సీయోను కోట.    ||మా ఇంటి||

1. మా తండ్రి యేసు పశువుల పాకలో 
     తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
     మోకాళ్ల కన్నీళ్ల ప్రార్థించె చూడు  ||మా ఇంటి||

2. మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో 
    సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) 
    తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
    మార్గము సత్యము జీవము చూడు ||మా ఇంటి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...