Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

12 October 2021

Bhulokarajyamulanniyu | భూలోక రాజ్యములన్నియు


భూలోక రాజ్యములన్నియు యెహోవా దేవునివే
భూలోక నివాసులందరు ఆయన వారసులే (2)

సమస్త దేశములారా సంతోషగానము చేయుడి -
యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయండి (2)
మహోన్నతం ప్రభు నామము పరిశుద్ధుడని కొనియాడుడి 
మహోన్నతుని మహత్యము సమాజములో కీర్తించుడి

సియోనులో సింహాసనాసీనుడు - నీతి న్యాయములతో పరిపాలించు వాడు (2)
అన్యజనులకు రక్షణ శృంగముగా (2)
నిబంధన జనులను నిత్యము నడిపించును (2) ||సమస్త||

సైన్యాధిపతిగా విజయము దయచేయును - శత్రువులను సహ మిత్రులను చేయువాడు (2)
భక్తులందరినీ అభయ హస్తముతో (2)
ప్రతి ఉదయమున కృపలతో తృప్తిపరచును(2) ||సమస్త||

ఈ లోక రాజ్యములు క్షయమై పోవునవి - దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము (2) 
తరతరములకు యుగయుగముల వరకు (2)
సర్వాధిపతిగా ప్రభువే పాలించును (2) ||సమస్త||

DOWNLOAD MP3 SONG HERE 👇

26 August 2021

Bhumiyu Daani Sampurnatha| భూమియు దాని సంపూర్ణత

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)

ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు||

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు||

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||

31 May 2020

Bhajana cheyuchu | భజన చేయుచు

81
యేసు నామ భజన
రా - హిందూస్థాని, ఆది - తోడి

   భజన చేయుచు భక్త పాలక - ప్రస్తుతింతు నీనామమును = వ్రజినముల పై జయము నిచ్చిన - విజయుడా నిను వేడుకొందు ||భజన||

1.దివ్య పదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు = భవ్య మైన బోధ లెన్నో - బాగుగా ధర నేర్పినావు ||భజన||

2.నరుల గానను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు = పరుడనైన నాకొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||

3.చెడినవాడ నైన నన్ను - జేర దీసి ప్రోచినావు = పడిన నాదు గోతి నుండి - పైకి లేవనెత్తి నావు ||భజన|| 

4.ఎంతప్రేమ యెంతదయ - యెంతకృప యేసయ్య నీకు = ఇంత యని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబు కాదు ||భజన|| 
- దొరిసామి ఆరోగ్యము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...