Showing posts with label Oke Aasha Eddarokkate Ela. Show all posts
Showing posts with label Oke Aasha Eddarokkate Ela. Show all posts

02 January 2022

Oke Aasha Eddarokkate Ela | ఒకే ఆశ ఇద్దరొక్కటే ఇలా

ఒకే ఆశ ఇద్దరొక్కటే ఇలా సాగాలని 
ఒకే శ్వాసై మీ హృదయాలు పెనవేసుకోవాలని
ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుని ఆశీస్సులతో
అభిషిక్తులైన ఆత్మీయులైన దేవుని పనివారల దీవెనలతో 
పరిమళాలు పూయించే పరిశుద్ధ జంటగా
పరిపూర్ణులై మీరు ఉండాలని 

సంధ్యారాణి ఎజ్రా శాస్త్రి 
ఇరువురు ఒక్కటయ్యే వేళలో 
దంపతులుగా మారి మీ గురి చేరువరకు 
అడుగులో అడుగు పడు ఈ ఘడియలో 
ఆ దేవుడే నీకు తోడుగా కలకాలం 
మీరాయన పనిలో కొనసాగాలని 

అలనాడు ఆదాము హవ్వల జతపరిచి 
పెండ్లి చేసినది దేవుడే 
రిబ్కా ఇస్సాకుల జంటను సమకూర్చి 
ఒకటిగా ముడి వేసినది దేవుడే 
ఆ దేవుడేర్పరిచిన ఈ దినము మొదలు 
విశ్వాసులకు మాదిరిగా మీరే నిలవాలని

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...