Showing posts with label John Wesley songs. Show all posts
Showing posts with label John Wesley songs. Show all posts

23 May 2025

Oohakandani prema ఊహకందని ప్రేమలోని


ఊహకందని ప్రేమలోని భావమే నీవు.. 
హృదయమందు పరవసించుగానమే నీవు.. 
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు.. 
మరపురాని కలల సౌధం గురుతులేనీవు.. ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు.. 
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు.|| ఊహకందని ప్రేమ ||

1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి 
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది.. (2)
అదియే.. ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో 
కన్నీరు కార్చిన ప్రేమగా 
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే 
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.(2) || ఊహకందని ప్రేమ ||

2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా 
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. (2)
అదియే.. ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము 
ఈ భువికి వచ్చిన భాగ్యము 
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే 
నీ సర్వమిచ్చిన దాతవు 
నను హత్తుకున్న స్వామివి (2) || ఊహకందని ప్రేమ ||

3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా 
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. (2)
నీవే నీవే యేసయ్య 
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు 
నీవు లేనిదే నా బ్రతుకులో 
విలువంటూ లేనే లేదయ్యా .(2) || ఊహకందని ప్రేమ ||

01 June 2023

Inthalone kanabadi anthalone ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే


ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే - అల్పమైన దానికా ఆరాటం
త్రాసుమీద ధూళి వంటి ఎత్తలేని నీటివంటి - స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏదీ కాదు నీ సొంతం - దాటిపోవును ఇల నీ సంపదలన్నియు

1.బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను భువినేలిన రాజులు
నాది నాది అంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా

2.మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో

24 November 2022

Naa pranama nalo neevu | నా ప్రాణమా నాలో నీవు


నా ప్రాణమా నాలో నీవు 
ఎందుకు కృంగియున్నావు 
యెహోవాయందే ఇంకను 
నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు -
అవమానములే కలిగిన వేళ (2) 
నీ కొరకే బలియైన యేసు -
సిలువను గూర్చి తలపోయుమా (2) 
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ 
శత్రువులే నీపై లేచిననూ (2) 
తల్లి అయినా మరచినా మరచున్ 
నేను నిన్ను మరువాననినా (2) 
యేసుని ప్రేమన్ తలపోయుమా 
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ -
సౌఖ్య జీవితమే కరువైననూ (2)
ప్రభు సేవలో ప్రాణములనే -
అర్పించవలసి వచ్చిననూ (2)
క్రీస్తునికే అంకితమై ఆనందించు 
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

25 October 2022

Kalavantidi nee jeevithamu | కలవంటిది నీ జీవితము


కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము (2)
విలువైనది నీ జీవితం - వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము 
బహు విలువైనది నీ జీవితం - వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది||

నిన్ను ఆకర్షించే ఈ లోకము 
కాటు వేసే విష సర్పము 
యువకా అది కాలు జారే స్థలము (2) 
ఉన్నావు పాపపు పడగ నీడలో 
నీ అంతము ఘోర నరకము 
యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది||

నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం 
నూతన సృష్టిగా మార్చును 
పాపం క్షమియించి రక్షించును (2) 
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు (2) || కలవంటిది||

08 December 2021

Jeevanadhila Nee Premalo | జీవ నదిలా నీ ప్రేమలో

జీవనదిలా నీ ప్రేమ నాలో ప్రవహిస్తుంటే - 
త్రోవచూపే నీ మాట నన్ను నడిపిస్తుంటే 
చింతకు చోటెక్కడ - ఓటమి జాడ ఎక్కడ (2)
అసాధ్యమైనవన్నీ నీ నామములో అన్ని సాధ్యమే (2) ||జీవనదిలా||

1. నా ముందు నడిచే నా దైవమా -  విందు శాలకు నడిపినావు - నీ కౌగిలిలో నా కన్నీరు - తొలగెను అది నా భాగ్యము (2)
ఊహకు అందని నీ ప్రేమ - లాలించును నన్ను తల్లిలా (2)||జీవనదిలా||

2. చేయి విడువని నా ప్రియుడా - నీ స్పర్శతో నా హృదయం పొంగెను - కన్నులు తెరచి నిను చూడగా - వింతైన దృశ్యం పులకించే నన్ను (2)
జీవింతును యేసయ్యా నీ నీడలో - పాలించుము నన్ను తండ్రిలా (2) ||జీవనదిలా||

DOWNLOAD MP3 SONG HERE 👇

26 March 2021

Andaru Nannu Vidichina | అందరు నన్ను విడచినా

అందరు నన్ను విడచినా - 
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

1.లోకము నన్ను విడచినా - నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే - నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

2.వ్యాధులు నన్ను చుట్టినా - బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే - నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)

3.నేనునిన్ను నమ్ముకొంటిని - నీవునన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే - నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు||
==============================
Andaru nannu vidachina - neevu nannu Viduvanantive (2)
Na thalliyu neeve - na thandriyu neeve
Na thalli thandri neeve yesayya (2)

Lokamu nannu vidachina - Neevu nannu viduvanantive (2)
Na bandhuvu neeve - na mithruda neeve
Na bandhu mithruda neeve yesayya (2)

Vyadhulu nannu chuttina - Badhalu nannu muttina (2)
Na kondayu neeve - Na kotayu neeve
Na konda kota neeve yesayya (2)

Nenu ninnu nammukontini - Neevu nannu viduvanantive (2)
Na thoduyu neeve - Na needayu neeve
Na thodu needa neeve yesayya (2)  ||Andaru||
DOWNLOAD MP3 SONG HERE 👇

03 February 2021

Prema Yesayya Prema | ప్రేమ యేసయ్యా ప్రేమ

ప్రేమ యేసయ్యా ప్రేమ(2) మారనిది మరువనిది 
వీడనిది ఎడబాయనిది 
                                             ||ప్రేమ||
నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ 
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ 
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ 
తన కృపలో నను దాచుకున్న ప్రేమ
                                             ||ప్రేమ||
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ 
తండ్రి విడచిన గాని నను విడువనన్న ప్రేమ 
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ 
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమ
                                             ||ప్రేమ||
నేను పుట్టకముందే నను ఎత్తుకున్న ప్రేమ 
నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ 
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ 
ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమ
                                             ||ప్రేమ||

20 January 2021

Naduvaleni Velalo | నడువలేని వేళలో ఎండిన

నడువలేని వేళలో.. ఎండిన ఎడారిలో..
నీకు నాకు తోడు యేసే - నిన్ను నన్ను నడుపు నేసు
దారి తెలియని యాత్రలో గాలి సంద్రపు అలలో
నీకు నాకు తోడు యేసే - నిన్ను నన్ను నడుపు నేసు 
                                                   ||నడువలేని||
అలలతో నీవు కొట్టబడిన నడిసంద్రంలో చిక్కుబడిన 
చెంత చేరి చేయిచాపి - జీవం ఇచ్చి నిలుపునుగా
విడువని ప్రేమతో లేవనెత్తి నడుపునుగా (2)
                                                  ||నడువలేని||
శ్రమలు నీవు కృంగిపోయిన ఆప్తులంతా దూరమైన 
ఆదరించి సేదతీర్చి హృదయ వాంఛను తీర్చునుగా
మరువని ప్రేమతో నిత్యము నిను నడుపునుగా (2)
                                                  ||నడువలేని||
________________________
Naduvaleni Velalo yendina yedaarilo
Neeku naaku thodu yese ninnu nannu nadupu nesu
Daari theliyani yaatralo gaali sandrapu alalo
Neeku naaku thodu yese ninnu nannu nadupu nesu.                                
                                           ||Naduvaleni||
Alalatho neevu kottabadina nadisandramlo chikkubadina
Chentha cheri cheyi chaapi jeevam echhi nilupunugaa
Viduvani prematho levanethi nadupunugaa
                                             ||Naduvaleni||
Shramalo neevu krungi poyina aapthulanthaa dooramaina 
Aadarinchi seda theerchi hrudaya vanchanu theerchunugaa
Maruvaleni prematho nithyamu nanu nadupunugaa
                                             ||Naduvaleni||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...