Showing posts with label Jeeva swaralu songs. Show all posts
Showing posts with label Jeeva swaralu songs. Show all posts

14 July 2021

Nee Sallani Supe O Yesayya | నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును

నీ సల్లని సూపే ఓ యేసయ్యా - నా బతుకును మార్చించి మెస్సీయా 
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా - నను సేదదీర్చింది మెస్సీయా 

1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా - తగ్గింపు నేర్పింది మెస్సీయా 
పరిశుద్ధ నీ నడత యేసయ్యా - మాదిరి నాకుంచింది మెస్సీయా 

2. నీవు కార్చిన రక్తం యేసయ్యా - నా పాపం కడిగింది మెస్సీయా 
నీవు పొందిన మరణం యేసయ్యా - నాకు జీవం పోసింది మెస్సీయా 

3. నీ దేహపు గాయం యేసయ్యా - స్వస్థత కలిగించింది మెస్సీయా 
నీ కలువరియాగం యేసయ్యా - కొత్తజన్మనిచ్చింది మెస్సీయా

Nuvve Kavali Yesuku Nuvve Kavali | నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి

నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి 
నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి 
నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి 
నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే 

1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు - నీదు అధికారము అక్కరరాదు 
నీదు పైరూపము లెక్కలోనికి రాదు - నీదు వాక్చాతుర్యము పనికిరాదు 

అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా చేసుకొని
విరిగి నలిగిన హృదయంతో దైవసన్నిధి చేరాలి 

2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము - నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము 
నీ గొప్ప పనులతో ఒరిగేది శూన్యము - నీ మంచితనము ముండ్లతో సమానము

Ningilo Chanduruda Mandagaache | నింగిలోని చందురుడా మందగాచే

నింగిలోని చందురుడా - మందగాచే ఇందురుడా
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా 
ఓ .. వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా 

1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా 
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంగిట అంటిపోతున్నా 
ప్రేమతో పెంచి మమతలు పంచిన - నీ శ్రమ చూడలేక గుండె పగిలిన 
తల్లిని శిష్యునికప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా 
ఓ ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమమూర్తి నీవయ్యా 

2. అందాలమోము పై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టిపీకగా 
యూదుల రాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా 
అంతా సహించి మౌనం వహించి - బాధించు వారిపై ప్రేమ చూపించి 
ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినావా 
ఓ .... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా 

3. లేత మొక్కలాంటి నీ దేహము పై కొరడాలెన్నో నాట్యము చేయగా 
మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో సీలలు కొట్టగా 
అంతటి శ్రమలో చెంతను నిలిచి - చింతతో ఉన్న అతివల జూచి 
నాకోసం ఏడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా 
ఓ .... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా

Yentha Sundaramo Aa Paralokamu | ఎంత సుందరమో ఆ పరలోకము అంతా

ఎంత సుందరమో ఆ పరలోకము - 
అంతా సువర్ణమే ఏమి చిత్రము 
చేరాలనుకుంటే ఆ పట్టణము - 
యేసయ్యకివ్వాలి నీ హృదయము 

1. కాంతి నిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు
వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు 
దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండును
జనములు ఆ వెలుగునందు సంచరించుచుందురు

2. ఆకలి దాహము ఉండనే ఉండవు 
చీకటి రోగము ఉండనే ఉండవు 
ప్రభువైన దేవుడే వారితో నివసించును 
కన్నీటి బిందువులను తానే తుడిచి వేయును 

3. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు
అసహ్యమైనది ఏది అందులో ఉండదు
జీవగ్రంథమందు రాయబడినవారే ఉందురు
ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు
DOWNLOAD MP3 SONG HERE 👇

Evadandi Baabu Veedu | ఎవడండీ బాబూ వీడు

ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు 
గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు 

1. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు
పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు
దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు 
గుండె తూట్లు పడ్డాగాని దాన్ని మాత్రం విడువడు 

2. సరదా అంటూ మొదలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు 
డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాడు 
ఆరోగ్యమే క్షీణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు 
శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు 

3. దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు
పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు
పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు
యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు
DOWNLOAD MP3 SONG HERE 👇

Yedabayani Deva Emmanuyelu | ఎడబాయని దేవా ఇమ్మానుయేలు

ఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా 
మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా 

అ.ప: స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును 

1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా 
నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా 
నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా 

2. నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము 
నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము 
గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా
DOWNLOAD MP3 SONG HERE 👇

Yesu Naa Priyakaapari Rakshanaku | యేసు నా ప్రియకాపరి రక్షణకు

యేసు నా ప్రియకాపరి - రక్షణకు నిజమైన దారి
నడిచెదను ఆయన వెంటే - నిలిపి ఆయనపై నా గురి

1. తండ్రి తనయుని ఎరిగినట్లుగా - మంచి కాపరి నన్ను ఎరుగును 
పేరు పెట్టి నన్ను పిలుచును - నాకుముందు తాను నడచును

2. తండ్రి చేతిలో నేను ఉండగా - నన్నెవరూ అపహరింపలేరుగా 
నిదురపోక నన్ను కాయును - దినములన్ని క్షేమమీయును 

3. గొర్రెనైన నాకు జీవమీయగా - తన ప్రాణమునే బలిగా చేసెను
 శాంతి జలము చెంతజేర్చును - కృపను జూపి సేదదీర్చును
DOWNLOAD MP3 SONG HERE 👇

03 June 2021

Kalyana veduka ramaneeya geethika | కళ్యాణ వేడుక రమణీయ గీతిక

కళ్యాణ వేడుక - రమణీయ గీతిక - శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక - 
క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక 

1. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు 
సంఘ వధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 
కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 

2. ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇల జీవించగా 
సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా 
పరిశుద్దుడే కలిపె ఇరువురిని ఒకటిగా 

3. కిలకిల రవళుల వీణెలు మ్రోగెను ఆనందల హరుల సందడి సాగెను 
పరలోక దూతల సంతోషగానాలు బంధుమిత్రుల అభినందన మాలలు 
ఆ జంట కనులలో వెలిగే కాంతులు
DOWNLOAD MP3 SONG HERE 👇

Neevunna Naa Gruhamu | నీవున్న నా గృహము ఆనంద నిలయము

నీవున్న నా గృహము - ఆనంద నిలయము 
నాకున్న ఈ సర్వము - ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము 
అ.ప: ప్రభు స్తుతియించెదన్ - నిను ప్రణుతించెదన్ నేనూ నా యింటివారితో 

1.నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే 
నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే 

2.నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట వ్యర్థమే 
నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే 

3.నీవే కృపగల దేవుడవు - మేలులతో తృప్తి పరచెదవు 
నీవే సర్వసమర్థుడవు - సమృద్ధితో నను నిం పెదవు

Nee Mandiram Prardhanaa Mandiram | నీ మందిరం ప్రార్థనా మందిరం నీ తేజో

నీ మందిరం - ప్రార్థనా మందిరం నీ తేజో మహిమ నిలుచుస్థలం - మాకెంతో క్షేమకరం 

1. నీ మందిరములో నిలుచునట్లు నీ వేర్పరచుకొనువారు ధన్యులు 
నీ మందిరములో నే పచ్చని ఒలీవ చెట్టువలె ఉన్నాను 

2. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినములకన్నా శ్రేష్టము 
నీ మందిరములోని మేలుచేత మేము తృప్తి పొందుచున్నాము 

3. నీ నివాసమెంతో రమ్యమయా నీ సన్నిధి మాకెంతో ఇష్టమయా 
నీ మందిరములో ప్రజలయెదుట మా మ్రొక్కుబళ్ళు చెల్లించెదము
DOWNLOAD MP3 SONG HERE 👇

Yehova Aasheervadamu Neemeeda | యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును

యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును గాక 
యెహోవా యెక్క ప్రసన్నత నీ పైన నిలుచును గాక యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆదుకొను గాక యెహోవా దేవుని నామము నిన్నుద్దరించు గాక 
యెహోవా నీ ప్రాకారములో నెమ్మది కలిగించును గాక యెహోవా నీ నగరులలో క్షేమమునుంచును గాక 

2. యెహోవా నీదు దహనబలులు అంగీకరించును గాక యెహోవా నీ నైవేద్యములు ఆఘ్రాణించును గాక 
యెహోవా నీ కోరికను సిద్ధింప జేయును గాక 
యెహోవా నీ ఆలోచన సఫలము చేయును గాక 
యెహోవా ఆపత్కాలమందు నీ కుత్తరమిచ్చును గాక యెహోవా పరిశుద్ధ స్థలమునుండి సహాయము చేయును గాక  

3. యెహోవా నీ శ్రమలన్నిటినుండి నిను విడిపించును గాక యెహోవా నీ భయములనుండి నిను తప్పించును గాక యెహోవా సన్నిధి కాంతి నీపై ఉదయింపజేయును గాక యెహోవా తన ముఖకాంతి నీపై ప్రకాశింప జేయును గాక యెహోవా తన దయచేతనే నీ కొమ్ము హెచ్చించును గాక యెహోవా ప్రభావ గౌరవము ధరింపజేయును గాక 

4. యెహోవా తన దండముతో నిన్నాదరించును గాక యెహోవా నీ శత్రువు ఎదుట భోజనమేర్పరచును గాక యెహోవా తెగులేమి రాకుండా నిన్ను కప్పును గాక యెహోవా నీ రాకపోకలలో నిను కాపాడును గాక 
యెహోవా కలిమి సంపదతో నిన్ను దీవించు గాక 

5. యెహోవా దీర్ఘాయువును నీకు దయ చేయును గాక యెహోవా మేలుతో నీ హృదిని సంతృప్తి పరచును గాక యెహోవా నీ కష్టార్జితము అనుభవింప జేయును గాక యెహోవా రక్షణ వస్త్రముతో అలంకరించును గాక యెహోవా నిత్యము నీమీద సమాధానముంచును గాక ఆమెన్ ( 8 )
DOWNLOAD MP3 SONG HERE 👇

Mamathalu Nindina Rupamaa | మమతలు నిండిన రూపమా వెలుగులు

మమతలు నిండిన రూపమా - వెలుగులు చిందే దీపమా తేనియ కమ్మదనం - వెన్నెల చల్లదనం కలబోసి విరిసిన దేవుని బహుమానమా 

1. మాతృత్వం ఏ స్త్రీకైనా మురిపించు ఒక వరం ఏ వేదన బాధలనైనా మరిపించు శిశువు స్వరం
ఎన్నాళ్ళు దాగిన స్వాస్థమో - ఎన్నేళ్ళ ప్రార్థన ఫలమో నీ జన్మ ఎందరికో ఇల ఆశీర్వాదం 

2. నీలాంటి చిన్నలనెంతో ప్రేమించె యేసయ్య ఏలాంటి కపటమెరుగని నీ మనసె కోరెనయ్య
బలవంతుని చేతిబాణమై - ఫలమిచ్చెడు ద్రాక్షతీగవై వర్థిల్లు ఇలలో ఆ ప్రభుప్రేమలో
ఆమని
DOWNLOAD MP3 SONG HERE 👇

Nalugeyare Ammalaara Naluguru | నలుగేయరే అమ్మలార నలుగురు

నలుగేయరే అమ్మలార - నలుగురు జేరి ప్రేమ మీర
మన ప్రభువును మదినుంచుకొని మనస్సున సంతోషం నింపుకొని

1.ఇంతులు మీరందరు చేరి చేమంతులు చేత బట్టండి 
మల్లెలు దండలుగా కూర్చి పెళ్ళికూతురి సిగలో జుట్టండి 
అందమైన ఆ మోములో సిగ్గులు చూడండి చందమామ ప్రతిబింబమని పాటలు పాడండి 

2.తైలము దండిగ రాసి తలస్నానము చేయించండి
అగరు గంధము పూసి పెళ్ళికళను తెప్పించండి
పల్లకిలోని ప్రియురాలి ఊసులె చెప్పండి అల్లరిగా సాగే కథల ముడులే విప్పండి 

3.మేని ఛాయ మెరవంగ మంచి పసుపు రాయండి
సువాసనలు విరియంగ అత్తరు పన్నీరు జల్లండి
వరుని ముందు నిలవంగ సిద్ధము చేయండి ప్రియునితో చేయి కలపంగ అక్షింతలు వేయండి
DOWNLOAD MP3 SONG HERE 👇

Muddhu Muripala Chinnari Naanna | ముద్దు మురిపాల చిన్నారి నాన్నా

ముద్దు మురిపాల చిన్నారి నాన్నా - 
సద్దుచేయకే నా చిట్టికన్నా 
ఈ మాట వింటే మదిని దాచుకుంటే 
నీ జీవితంలో సిరుల పంటే - 
ఆనందం కలకాలం నీ వెంటే జోలాలీ లాలీ జోలాలీ (2)

1.తల్లిదండ్రులను గౌరవించి - తనవారినెల్లను ప్రేమించి శత్రువులను సయితము క్షమించి - 
పరిచారకుడుగా జీవించి దేవాది దేవుడే 
అత్యంత దీనుడై ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను 
ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం 
ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం - జోలాలీ లాలీ జోలాలీ (2)

2.దేవుని ఉపదేశమును మరువక దయను సత్యమునెన్నడు విడువక బుద్ది వివేచనకై వెదకిన - భయభక్తులు యేసునియందుంచిన 
సుఖజీవము కలిగి ధరలో జీవింతువు 
దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు 
నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం 
పరలోకం చేరేందుకు ఏకైకమార్గం - జోలాలీ లాలీ జోలాలీ (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Vivahamannadi Pavithramainadi | వివాహమన్నది పవిత్రమైనది

వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది 

1.ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు

2.ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు 

3.దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు

DOWNLOAD MP3 SONG HERE 👇

Vachindi Vachindi Madhuramaina | వచ్చింది వచ్చింది మధురమైన సమయం

వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్యా వరుడా (రావమ్మ వధువా) 
సుస్వాగతం నీ కోసమే ఈ స్వాగత గీతం 

1. మల్లెలు పరిమళం చల్లినవేళ - అల్లరి తెమ్మెర తాకినవేళ 
వెల్లువై ఆనందం పొంగినవేళ మెల్లగ నీ పతి దరిచేరగా 

2. కోయిల గానాలు వినిపించువేళ - కోరిన ఘడియలు ఎదురైనవేళ 
చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా 

3. పరలోక వాకిళ్ళు తెరచుకున్నవేళ - పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ 
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ వినయముగా నీ ప్రియుని సంధించగా

DOWNLOAD MP3 SONG HERE 👇

Koniyadabadunu Yehovayandu | కొనియాడబడును యెహోవాయందు

కొనియాడబడును యెహోవాయందు - భయభక్తులు గల వనిత -
తనవారికైనా పగవారికైనా - పంచును సమత మమత (2)

1.ప్రతి పరిస్థితిని ప్రేమతో - భరించగలిగిన ఓర్పు - ప్రతికూలతను అనుకూలముగా - మార్చేటి నేర్పు(2)
కలిగిన భార్య ఇంటికే దీపము (2) 
సంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము (2) ||కొనియాడ||

2.తండ్రివలె ఓదార్చి - తల్లివలె సేదదీర్చి - మిత్రునివలె భర్తకు ఎపుడు తోడుగ నిల్చును (2)
దైవజ్ఞానముతో కుటుంబమును నడుపును(2) 
రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును (2) ||కొనియాడ||

3.బ్రతుకు దినములన్నియును - భర్తకు మేలే చేయును - దీనులకు దరిద్రులకు తనచేయి చాపును (2) 
ఆహారమును తానే సిద్ధపరచును(2) ఇంటివారినందరిని కనిపెట్టుచుండును (2) ||కొనియాడ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Madhuram Ee Samayamu Hrudayam | మధురం ఈ సమయము హృదయం

మధురం ఈ సమయము - హృదయం ఉప్పొంగెను (2)
మన బ్రతుకులో మరో ఏడు గడచిపోయెను 
తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను (2) 
Happy new year - (4) 

1. సిరిగలవారెందరో - బలమున్న మరెందరో - 
మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి (2)
కాదు కాదు మన ఘనత - కేవలమిది తనదు కృప (2) 
మనలనింక ఊపిరితో మహిలొనుంచెను (2)
మధురం ఈ సమయము - హృదయం ఉప్పొంగెను(2)
Happy new year - (4) 

2. లెక్కలేమి ఆపదలు - చుట్టుకున్న వేళలలో 
చక్కనైన జ్ఞానమిచ్చి చిక్కులన్ని బా పెను (2)
విడువలేదు ఏ క్షణము - మరువలేదు ఏ దినము(2)
దీవెనలెన్నో కృపతో మనకు పంచెను (2) ||మధురం||
DOWNLOAD MP3 SONG HERE 👇

Anuraagavalli Maa Inti Jaabilli | అనురాగవల్లి మా యింటి జాబిల్లి

అనురాగవల్లి - మా యింటి జాబిల్లి (2)
మధురమైన నీ పెళ్ళి - మా కంటివెలుగు ఓ తల్లి (2)

1. అణుకువ అనురాగముతో అందరి మన్నన పొందాలి -
ఆదర్శగృహిణివై నీ యింటిని ఆనంద గృహముగా తీర్చాలి (2)
ఆత్మీయ వరములు - మెండుగా నీ ముంగిట వర్షించాలి (2) నీ అక్కరలన్నీ తీరాలి ||అనురాగ||

2. కలిమి లేములలో కృంగక - కరములు జోడించి వేడాలి -
కరుణామయుని కనికరం - కలకాలం నీకుండాలి (2)
కన్నవారింటి గౌరవం - కలకాలం కాపాడాలి( 2) నీ యింటి పేరు నిలపాలి ||అనురాగ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Kurisindi Navvula Vaana | కురిసింది నవ్వుల వాన వివాహ

కురిసింది నవ్వుల వాన - వివాహ శుభ సమయాన - 
నాలో కలిగే సందడి - నాలో కదిలె సవ్వడి - 
హృదయాలు స్పందించె వేళ - ఈ వేళ (2)
కురిసింది నవ్వుల వాన - వివాహ శుభ సమయాన

1.కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం - 
దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో భావం - 
ఒంటరి జీవితం జంటగ మార్చెనే - 
ఇరు హృదయాలను ఒకటిగ కూర్చెనే - 
దేవుడే కలిపిన బంధం - వీడిపోని అనుబంధం ||కురిసింది||

2.గోరుమామిడమ్మ పూచెనమ్మ అనురాగం -
మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం -
వాక్యపు వెలుగులో- బ్రతుకులు పండగా - 
దేవుడు తోడుగ మీతో నుండగా - 
సాగేటి ఈ బంధం - వీగిపోని అనుబంధం ||కురిసింది||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...