Showing posts with label Ayyo edi dukhamu prabhu. Show all posts
Showing posts with label Ayyo edi dukhamu prabhu. Show all posts

16 February 2023

Ayyo edi dukhamu prabhu theerpu |అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ

230
అంత్య దినము
రా - వంతురాలి, తా - ఆది 
 
అయ్యో యిది దుఃఖము - ప్రభు తీర్పువేళ - నయ్యో యిది యెంత దుఃఖము = చయ్యన యెహోవా సింహా - సనము చుట్టు వహ్ని మండు - నయ్యెడ విశ్వాసులకు దు - రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||
 
1.తల్లి పిల్లలు గూడుదు రచటఁ - దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ - కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
 
2.అన్నదమ్ములచటఁ - గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు = రెన్నఁ డు మరి చూడ రాని - యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||
 
3.భార్యాభర్తలు గూడుదురు రచట - బంధు మిత్రులు కలియుదురు రందుఁ = కార్య భేదమువలన సర్వ - కాలము మరి కూడఁజాల ||రయ్యో||
 
4.క్రీస్తు మత ప్రబోధకులు స - మస్త శిష్యులు కూడుదు రచట = వాస్తవ స్థితు లెరుఁగఁబడిన - వలనను విడఁబడుదు రంద ||రయ్యో||
 
5.శిష్టులు దుష్టులు కూడుదు రచట - స్నేహవంతు లందుఁ గలియుదు = రిష్టము గాని భిన్నులగుచు - నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||
 
6.అల పిశాచి పాపు లందరు - నడుపు కర్తకు భిన్ను లగుచు - పలుగొరుకుల నిత్య నరక - బాధల పాల్బడక పోరు ||అయ్యో||
 
7.సాధు సజ్జనంబు లెల్ల - సకల దూతలతోడఁ గూడి = మోదముతో - ప్రభుని వెంట - ముక్తి కేగి నిత్యులగుదు = రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ - నాహా యిది యెంత విజయము ||అయ్యో|| 
- పురుషోత్తమ చౌదరి 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...