Showing posts with label ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే. Show all posts
Showing posts with label ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే. Show all posts

02 May 2021

Emundi naalo ye parishudhata | ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే


ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే - అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని - చేర దీశావు ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు - కరుణించావు నన్ను విడిపించావు ||ఏముంది||

1. అన్యాయపు తీర్పు పొందావా నాకై - అపహాస్యం భరియించావా
ఆదరణే కరువై బాధింపబడియు - నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను పులకించింది  ||ఏముంది||

2. గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం - నా కోసం భరియించావా..
ఊసిరి నీదు మోముపైన - అపహస్యం సహియించావా...
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...