Showing posts with label నమ్మి నమ్మి మనుషులను. Show all posts
Showing posts with label నమ్మి నమ్మి మనుషులను. Show all posts

06 November 2020

Nammi Nammi Manushulanu | నమ్మి నమ్మి మనుషులను

నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి
పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు         ||నమ్మి||

1. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన 
    బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను
    నా యేసయ్యను నమ్మిన యెడల 
    ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ||నమ్మి||

2. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన 
    ఆకాను ఏమాయెను ? అగ్నికి ఆహుతియాయెను 
    నా యేసయ్యను నమ్మిన యెడల 
    మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే       ||నమ్మి||

3. సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన 
    గెహజీ ఏమాయెను ? రోగమును సంపాదించెను 
    నా యేసయ్యను నమ్మిన యెడల 
    శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే    ||నమ్మి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...